Share News

Ceiling Fan Cleaning: ఈ ట్రిక్ తెలుసుకుంటే ఫ్యాన్ దుమ్మును క్షణాల్లో దులిపేయవచ్చు..

ABN , Publish Date - Feb 05 , 2025 | 01:52 PM

ఇంట్లో క్లీనింగ్ అంటేనే కొందరికి స్ట్రెస్‌గా అనిపిస్తుంది. ఇక సీలింగ్ ఫ్యాన్‌ను క్లీన్ చేయడం అంటే పెద్ద సమస్య. అయితే, ఫ్యాన్‌ దుమ్మును ఈ ట్రిక్‌తో క్షణాల్లో దులిపేయవచ్చు. మరి ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం..

Ceiling Fan Cleaning: ఈ ట్రిక్ తెలుసుకుంటే ఫ్యాన్ దుమ్మును క్షణాల్లో దులిపేయవచ్చు..
Ceiling Fan Cleaning

Ceiling Fan Cleaning Tips: ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటారు. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. శుభ్రత ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందని కూడా నమ్ముతారు. అయితే, ఇంట్లో క్లీనింగ్ అంటేనే కొందరికి స్ట్రెస్‌గా అనిపిస్తుంది. ఫ్లోర్ క్లీన్ చేయడం, దుమ్ము పట్టిన ఫర్నీచర్‌ను దులపడం వంటి పనులు చేయడం ఒకెత్తు అయితే ఎత్తులో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌ను క్లీన్ చేయడం ఇంకా ఇబ్బంది.

ప్రతి ఇంట్లోనూ సీలింగ్‌ ఫ్యాన్‌ కచ్చితంగా ఉంటుంది. ఇంట్లో తరచు అన్నీంటిని శుభ్రం చేసినా ఈ సీలింగ్‌ ఫ్యాన్‌ చాలా ఎత్తులో ఉండటం వల్ల దీనిని శుభ్రం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. దీనివల్ల ఫ్యాన్‌పై దుమ్ము, దూళీ ఎక్కువగా పేరుకుపోతాయి. ఇలా దుమ్ముతో ఉన్న ఫ్యాన్‌ తిరగడం వల్ల ఇంట్లోని గాలి కలుషితం అయి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అయితే, సీలింగ్‌ ఫ్యాన్‌పై ఉన్న డస్ట్‌ను ఈ ట్రిక్‌తో ఈజీగా తొలగించవచ్చని నిపుణులు అంటున్నారు. మరి ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం..


సీలింగ్‌ ఫ్యాన్ శుభ్రపరిచే చిట్కాలు

సీలింగ్ ఫ్యాన్‌ను క్లీన్ చేయడానికి పాత దిండు కవర్‌ను ఉపయోగించండి. దిండు కవర్‌తో ఫ్యాన్‌పై ఉన్న దుమ్మను శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల దుమ్మ మీ ముఖంపై పడదు. తర్వాత నిమ్మరసం, ఉప్పు కలిపి స్ప్రే తయారు చేయండి. ఆ స్ప్రేను ఫ్యాన్ బ్లేడ్లపై స్ప్రే చేయండి. తర్వాత ఫ్యాన్ బ్లేడ్లను శుభ్రమైన గుడ్డతో తుడవండి. మీరు ఇలా చేస్తే, మీ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ ఖచ్చితంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అది కూడా కొన్ని నిమిషాల్లోనే క్లీన్‌గా కనిపిస్తుంది. ఈ వారంలో ఒక్కసారి ఈ ట్రిక్ ట్రై చేసి మీ ఫ్యాన్‌ను శుభ్రంగా ఉంచుకోండి.

Also Read: ఆపిల్‌ను ఎట్టిపరిస్థితిలోనూ ఇలా తినకండి..

Updated Date - Feb 05 , 2025 | 02:26 PM