Share News

Final Diwali Post: క్యాన్సర్ గెలిచింది.. ఇదే నా చివరి ఏడాది.. యువకుడి ఎమోషనల్ పోస్ట్..

ABN , Publish Date - Oct 16 , 2025 | 03:47 PM

ఇంకో రెండు నెలల్లో చనిపోయే 21 ఏళ్ల ఓ యువకుడు తన మరణం గురించి రెడ్డిట్‌లో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో తాను క్యాన్సర్‌తో చనిపోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

Final Diwali Post: క్యాన్సర్ గెలిచింది.. ఇదే నా చివరి ఏడాది.. యువకుడి ఎమోషనల్ పోస్ట్..
Final Diwali Post

ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏదైనా ఉంది అంటే.. అది కచ్చితంగా మనం ఎప్పుడు చచ్చిపోతామో ముందుగానే తెలియటమే. ఇంకో రెండు నెలల్లో చచ్చిపోతాము అని తెలిసిన వ్యక్తి మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చచ్చిపోయే వరకు ప్రతీ క్షణం చస్తూ బతకాల్సి వస్తుంది. చావు కోసం బాధగా ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంకో రెండు నెలల్లో చనిపోయే 21 ఏళ్ల ఓ యువకుడు తన మరణం గురించి రెడ్డిట్‌లో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు.


ఆ పోస్టులో.. ‘హాయ్.. నేను 21 సంవత్సరాల పురుషుడ్ని. 2023లో నాకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజీలో ఉన్నట్లు తేలింది. ఎన్నో కీమోథెరపీలు చేయించుకున్నాను. అన్నీ ట్రై చేశాను. కానీ, లాభం లేకుండా పోయింది. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. ఈ ఏడాదిలోనే చనిపోతానని చెప్పారు. దీపావళి వస్తోంది.


ఇప్పటికే దీపావళి సందడి మొదలైంది. ఇదే నా చివరి దీపావళి అని తల్చుకుంటే బాధగా ఉంది. నేను దీపాలను, నవ్వుల్ని, శబ్ధాన్ని మిస్ అవుతాను. రేపు నా స్థానంలో వేరే వాళ్లు దీపాలు వెలిగిస్తారు. నేను కేవలం ఓ జ్ణాపకంగా మిగిలిపోతాను. అలవాటులో పొరపాటుగా ఇప్పటికీ నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాను. కలలు కంటూ ఉంటాను తెలుసా?..


ఊర్లు తిరగాలి. సొంతంగా ఏదైనా చేయాలి. ఓ కుక్కను దత్తత తీసుకోవాలి. ఇలా అన్నిటి గురించి ఆలోచిస్తున్నపుడు నాకు అంత సమయం లేదని గుర్తుకు వచ్చి బాధేస్తుంది. నా తల్లిదండ్రుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానో అర్థం కావటం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

DIWALI.jpg


ఇవి కూడా చదవండి

కుక్క ఎంత పని చేసింది.. ఇల్లు తగలబడి పోయింది..

వామ్మో.. మాజీ ప్రియుడిపై ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఏం జరిగిందంటే..

Updated Date - Oct 16 , 2025 | 04:11 PM