Unexpected wedding moment: వధువు ఎంట్రీ రికార్డ్ చేయాలనుకున్నాడు.. కానీ, అతడి ఎంట్రీ వైరల్ అయింది..
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:21 PM
తాజాగా మరో పెళ్లి వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. వధువు ఎంట్రీని చిత్రీకరించేందుకు ఫొటోగ్రాఫర్ ఆపసోపాలు పడడం చాలా మందిని ఆకట్టుకుంటోంది. కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 37 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేసి తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు.
పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. తాజాగా మరో పెళ్లి వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. వధువు ఎంట్రీని చిత్రీకరించేందుకు ఫొటోగ్రాఫర్ ఆపసోపాలు పడడం చాలా మందిని ఆకట్టుకుంటోంది (bride entry viral video).
@shiivam33 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వధువు వేదిక వద్దకు చేరుకుంటుండగా ఇద్దరు కెమెరామెన్లు ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ముందు నుంచి షూట్ చేసిన తర్వాత వధువు వెనుక వైపునకు పరిగెత్తారు. ఆ సమయంలో ఒక ఫొటోగ్రాఫర్ పరిగెత్తుకుంటూ వచ్చి జారిపడిపోయాడు. అతడి కెమెరా కూడా ఎగిరిపడింది. అయితే ఆ ఫొటోగ్రాఫర్ అదేమీ పట్టించుకోకుండా వెంటనే పైకి లేచి చిత్రీకరణ ప్రారంభించాడు (wedding cameraman video).
ఆ వీడియోను ఆ ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేసి.. 'వధువు ఎంట్రీ సజావుగా జరిగింది. కానీ నాది కాదు. నేను నా విధిని నిర్వర్తించడానికి వెళ్ళాను. అప్పుడు ఒక స్కామ్ జరిగింది' అని కామెంట్ చేశాడు (viral wedding clip). ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 37 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేసి తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ఫోటోగ్రాఫర్ వృత్తి నైపుణ్యం, అంకితభావాన్ని చాలా మంది ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
హోటల్లో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కన్నీరు పెట్టుకున్న భర్త..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..