wedding night divorce: పెళ్లైన 20 నిమిషాలకే విడాకులు.. అత్తారింటికి వెళ్లాక ఏం జరిగింది..
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:51 PM
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన 20 నిమిషాలకే, ఒక యువతి దానిని రద్దు చేసుకుని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఆ యువతి పేరు పూజ. ఆమె తండ్రి భలువానిలో జనరల్ స్టోర్ నడుపుతుంటారు.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన 20 నిమిషాలకే, ఒక యువతి దానిని రద్దు చేసుకుని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఆ యువతి పేరు పూజ. ఆమె తండ్రి భలువానిలో జనరల్ స్టోర్ నడుపుతుంటారు. ఆ స్టోర్‌లో పని చేసే విశాల్ మధేసియా అనే యువకుడిని పూజ వివాహం చేసుకుంది. నవంబర్ 25న వీరి వివాహం జరిగింది (bride divorce 20 minutes).
పెళ్లి రోజు సాయంత్రం 7 గంటలకు వరుడి వివాహ ఊరేగింపు వధువు ఇంటికి చేరుకుంది. వివాహ ఆచారాలు రాత్రంతా కొనసాగాయి. ఉదయం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వరుడి కుటుంబంతో కలిసి వధువు తన అత్తమామల ఇంటికి చేరుకుంది. తన భర్తతో కలిసి గదిలోకి వెళ్లింది. అయితే 20 నిమిషాల తర్వాత, ఆమె గది నుంచి బయటకు వచ్చి తన భర్తతో ఇక నివసించలేనిని ప్రకటించింది. దీంతో బంధువులు, అతిథులు నివ్వెరపోయారు. మొదట పూజ ఏదో కోపంతో ఇలా చెబుతోందని అందరూ భావించారు. కుటుంబ సభ్యులు ఆమెను ఏమి జరిగిందని, ఎందుకు అకస్మాత్తుగా మనసు మార్చుకున్నావని అడిగారు. అయితే ఆమె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు (shocking wedding incident).
తన తల్లిదండ్రులను పిలవాలని, తాను ఇక్కడ ఉండనని చెబుతూనే ఉంది (bride leaves in-laws house). అందరూ ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ ఆమె తన మనసు మార్చుకోవడానికి అంగీకరించలేదు. దీంతో నవంబర్ 26వ తేదీన గ్రామ సర్పంచ్ ఆ ఇరు కుటుంబాలతో మాట్లాడి వివాహ రద్దు చేశారు. వివాహం రద్దు అయిందని పేర్కొంటూ ఒక లిఖిత ఒప్పందం జరిగిపోయింది. అయితే ఆ వధువు అంత అకస్మాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు.
ఇవి కూడా చదవండి..
థ్రిల్లింగ్ వీడియో.. అనకొండను వేటాడడం అంత ఈజీ కాదు.. చిరుత పరిస్థితి చూడండి..
మీ స్కిల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో చేప, ఓ వృద్ధుడు ఉన్నారు.. ఎక్కడో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..