Bride and Groom: ఈ వధూవరుల ఎంట్రీ చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:02 AM
తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో వధూవరుల ఎంట్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వివాహ వేదిక వద్దకు వధూవరుల ఎంట్రీ కోసం ప్లాన్ చేసిన ఓ డెకరేషన్ చూస్తున్న వారిని షాక్‌కు గురి చేసింది.
సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో వధూవరుల ఎంట్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (bride groom funny entry).
ghantaa అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ కార్యక్రమం జరుగుతోంది. వివాహ వేదిక వద్దకు వధూవరులు కలిసి వచ్చారు. అయితే వారి ఎంట్రీ కోసం ప్లాన్ చేసిన ఓ డెకరేషన్ చూస్తున్న వారిని షాక్‌కు గురి చేసింది. వివాహ వేదిక వద్ద తెల్లటి వస్త్రాలు వరుసగా పరిచి ఉన్నాయి. మొదట చూడగానే అవి తెల్లటి వస్త్రంలో చుట్టిన మృతదేహాలు లాగా కనిపించాయి. అయితే కొద్ది సేపటికి అవి బెలూన్ గేట్ మాదిరిగా తెరుచుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి (shocking wedding entry).
అవి వధూవరుల ప్రవేశం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఎయిర్ బ్యాగులు అని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు (trending wedding video). ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 80 లక్షల మంది వీక్షించారు. 1.4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఏదో ప్రమాదంలో అంత మంది చనిపోయి ఉంటారని తాను భావించినట్టు ఒకరు కామెంట్ చేశారు. ఈ థీమ్ చాలా భయంకరంగా ఉందని మరికొందరు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇదే పెద్ద ప్రమాదమంటున్న ఆనంద్ మహీంద్రా..
మీ బ్రెయిన్‌కు పరీక్ష.. ఈ మంచులో పెంగ్విన్‌ను 15 సెకెన్లలో కనిపెట్టండి..