Boys scooter crash: బిజీ రోడ్డుపై ట్రిపుల్ రైడింగ్.. చివరకు వారి పరిస్థితి ఏమైందంటే..
ABN , Publish Date - Nov 04 , 2025 | 06:30 PM
మనదేశంలో అత్యధిక మంది ట్రాఫిక్ నిబంధనలను పాటించరు. భద్రత కోసం ప్రభుత్వం, పోలీసులు ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా వాటిని ఎలా అతిక్రమించాలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా తాము ప్రమాదాలకు గురవుతారు.
మనదేశంలో అత్యధిక మంది ట్రాఫిక్ నిబంధనలను పాటించరు. భద్రత కోసం ప్రభుత్వం, పోలీసులు ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా వాటిని ఎలా అతిక్రమించాలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా తాము ప్రమాదాలకు గురవుతారు. ఇతరులను ప్రమాదాల బారిన పడేస్తుంటారు. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (triple riding accident).
drunken.raipur అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బిజీగా ఉన్న రోడ్డు మీద ఒక స్కూటర్‌పై ముగ్గురు అబ్బాయిలు ప్రయాణం చేస్తున్నారు. ఒక బాలుడు ఆ స్కూటర్‌ను నడుపుతున్నాడు. అయితే ఆ వాహనాల రద్దీ మధ్యలో స్కూటీని ఆ కుర్రాడు నడపలేక బ్యాలెన్స్ కోల్పోయాడు. రోడ్డు మధ్యలో స్కూటీ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయింది. స్కూటీ మీద ఉన్న ముగ్గురూ కిందపడిపోయారు. దీంతో చుట్టూ ఉన్న వాహనాలు ఆగిపోయాయి (reckless driving).
ఈ ఘటనను ఒకరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (funny accident video). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 40 లక్షల మంది వీక్షించారు. 4 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. వారికి తగిన శాస్తి జరిగిందని చాలా మంది కామెంట్లు చేశారు. వారి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని మరికొందరు సూచించారు.
ఇవి కూడా చదవండి..
కెనడాలో విచిత్రమైన కప్ప.. నోటిలో కళ్లు.. కారణమేంటంటే..
మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని రెండు తేడాలను 27 సెకెన్లలో కనిపెట్టండి
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..