Dangerous bike stunt: ఇదేం పోయేకాలం సోదరా.. ట్రక్ వెనుక బైక్ ఎలా నడుపుతున్నాడో చూడండి..
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:42 PM
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (bike stunt behind truck).
@1VaishaliMishra అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బిజీగా ఉన్న రోడ్డు మీద కొందరు యువకులు బైక్‌లతో విన్యాసాలు చేస్తున్నారు. ఒక యువకుడు బైక్‌ను పలు వంకర్లు తిప్పుతూ ఓ భారీ ట్రక్కు వెనుక పోనిస్తున్నాడు. ఒక దశలో ట్రక్‌కు వారి బైక్ అత్యంత సమీపంగా వచ్చి ఢీకొడుతుందేమో అన్నట్టు నడిపాడు. అయితే అదృష్టవశాత్తూ అలాంటి ప్రమాదం జరగలేదు. వెనుక వస్తున్న స్నేహితులు వారి స్టంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (viral road stunt video).
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (dangerous driving video). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షన్నర కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆ ట్రక్ కింద పడితే ఆ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి వారు ట్రక్కుల కింద నలిగిపోతారని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి బైక్ లైసెన్స్‌ను రద్దు చేయాలని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
అరటిపండు సుత్తిలా మారుతుంది.. వేడినీరు సెకెన్లలో గడ్డకడుతుంది..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 37ల మధ్యలో 87 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..