Viral Video: వావ్.. ఎంతో స్టామినా ఉంటే తప్ప ఇలాంటి స్టంట్ చేయడం కష్టం.. వీడియో చూస్తే..
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:44 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాలకు చెందిన వారి ప్రతిభ కూడా అందరినీ క్షణాల్లో చేరిపోతోంది. ఏ మాత్రం ట్యాలెంట్ ఉన్నా అది నిమిషాల్లో సోషల్ మీడియా ఖాతాల ద్వారా అందరినీ చేరిపోతోంది. ఇప్పటికే అలాంటి ఎన్నో వైరల్ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాలకు చెందిన వారి ప్రతిభ కూడా అందరినీ క్షణాల్లో చేరిపోతోంది. ఏ మాత్రం ట్యాలెంట్ (Talent) ఉన్నా అది నిమిషాల్లో సోషల్ మీడియా ఖాతాల ద్వారా అందరినీ చేరిపోతోంది. ఇప్పటికే అలాంటి ఎన్నో వైరల్ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
shivazfitzone అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. గ్రామంలో ఉన్న ఓ బావిలో ఓ యువకుడు అద్భుతమైన స్టంట్ చేశాడు (Stunt Video). బావి (Well) అంచులను తన చేతులు కాళ్లతో పట్టుకుని జంప్ చేసుకుంటూ కింద వరకు వెళ్లిపోయాడు. మళ్లీ అలాగే జంప్ చేసుకుంటూ నీటి నుంచి బావి పైవరకు వచ్చేశాడు. ఎంతో స్టామినా ఉంటే తప్ప అలాంటి స్టంట్ చేయడం కష్టం. కండలు తిరిగిన దేహంతో ఉన్న ఆ కుర్రాడు ఆ ప్రమాదకర స్టంట్‌ను చాలా సునాయాసంగా పూర్తి చేశాడు. ఆ స్టంట్‌ను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.6 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోలోని కుర్రాడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఆ కుర్రాడి స్టామినా అత్యద్భుతం అని ఒకరు కామెంట్ చేశారు. ఆ కుర్రాడి సామర్థ్యానికి సెల్యూట్ చేయాల్సిందే అని మరొకరు పేర్కొన్నారు. అంత పెర్ఫెక్ట్‌గా చేసేందుకు ఆ కుర్రాడు ఎంతలా ప్రాక్టీస్ చేశాడో అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఒక్క రోజూ పని చేయకపోయినా రూ.26 లక్షల జీతం.. అబుధాబి కంపెనీకి కోర్టులో షాక్..
మొసలితో పెట్టుకునే ముందు ఆలోచించాల్సిందే.. వీడియో కోసం స్టంట్ చేయాలనుకుంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..