Woman Missing from Maha kumbh: సోషల్ మీడియాలో తల్లి ఫొటో చూసి షాక్.. పోస్టు పెట్టిన వారిని వాకబు చేస్తే..
ABN , Publish Date - Mar 14 , 2025 | 03:26 PM
కుంభమేళాలో తప్పపోయిన ఓ మహిళ సోషల్ మీడియా పుణ్యమా అని మళ్లీ తన కుటుంబసభ్యలను చేరుకోగలిగింది. ఇందుకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని ఉపయోగాలు ఉన్నాయనేందుకు తాజాగా ఉదాహరణగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుంభమేళాలో తప్పిపోయిన ఓ మహిళ సోషల్ మీడియా పుణ్యమా అని తన కుటుంబసభ్యులను మళ్లీ చేరుకోగలిగింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాకు చెందిన లఖ్‌పతో దేవీ తన కుటుంబంతో కలిసి ఫిబ్రవరి 23న కుంభమేళాకు వెళ్లింది. అక్కడ దురదృష్టవశాత్తూ తప్పిపోయింది. కుటుంబసభ్యులు ఆమెకు కోసం రెండు రోజుల పాటు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో, వారు నిరాసగా వెనక్కు వచ్చేశారు. చివరకు ఇంటికొచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Indian Talking Loudly At Airport: అస్సలు మర్యాద లేదు.. సాటి భారతీయుడిని తిట్టిపోసిన ఎన్నారై!
మరోవైపు లఖ్‌పతో దేవి ఝార్ఖండ్‌లోని గర్వీ గ్రామానికి చేరుకుంది. అక్కడకు ఎలా చేరుకుందీ ఆమెకు కూడా తెలీదు. అయోమయంలో ఉన్న ఆమె చూడగానే స్థానికురాలు కాదని గుర్తించిన గ్రామ సర్పంచ్ సోదీ దేవి, ఆమె భర్త బాధితురాలికి ఆశ్రయం కల్పించారు. రోజూ ఆహారం పెట్టి ఆదుకున్నారు. అంతేకాకుండా, ఆమెను తన కుటుంబసభ్యుల వద్దకు చేర్చేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె గురించి వివిధ మార్గాల్లో వాకబు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో సోనీ దేవి తన బంధువు సాయంతో ఆమె ఫొటో ఇతర వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Honesty in relationships: నిజాయితీగా ఉంటే బంధాలు బలపడతాయా.. సైకాలజిస్టులు ఏం తేల్చారంటే..
ఈ పోస్టు వైరల్ కావడంతో బాధితురాలి కుమారుడు రాహుల్ దృష్టి దీనిపై పడింది. ఆమె తన తల్లే అని రూఢీ పరుచుకున్నాక రాహుల్ కుమార్ ఝార్ఖండ్‌కు వెళ్లి తల్లిని వెనక్కు తీసుకొచ్చాడు. దీంతో, ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఇక ఎన్నడూ చూడలేమేమో అని అనుకుంటున్న వ్యక్తి కళ్ల ముందు కనబడటంతో వారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఈ ఘటన నెట్టింట కూడా వైరల్ కావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా సక్రమంగా వాడితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అనేక మంది కామెంట్ చేశారు.