Share News

Teacher Caught On Camera: పిల్లాడితో కాళ్లకు మసాజ్.. అడ్డంగా దొరికి పోయిన టీచరమ్మ..

ABN , Publish Date - Aug 11 , 2025 | 01:09 PM

Teacher Caught On Camera: ఆమె కుర్చీలో కూర్చుని ఉండగా ఆ బాలుడు ఆమె పాదాలకు ఎంతో భక్తి శ్రద్ధలతో మసాజ్ చేశాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Teacher Caught On Camera: పిల్లాడితో కాళ్లకు మసాజ్.. అడ్డంగా దొరికి పోయిన టీచరమ్మ..
Teacher Caught On Camera

విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన టీచర్లు మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యా, బుద్ధులు నేర్పాల్సిన వాళ్లు గాడి తప్పుతున్నారు. పిల్లలతో క్రూరంగా నడుచుకుంటున్నారు. తాజాగా, ఓ టీచరమ్మ విద్యార్థితో దారుణంగా ప్రవర్తించింది. క్లాస్ రూములో పిల్లాడితో కాళ్లకు మసాజ్ చేయించుకుంది. మిగిలిన విద్యార్థుల ఎదుటే ఈ పని చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


భోపాల్‌లోని గాంధీనగర్‌లో మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాల ఉంది. గత గురువారం ఓ మహిళా టీచర్ ఓ విద్యార్థిని పిలిచి కాళ్లకు మసాజ్ చేయించుకుంది. ఆమె కుర్చీలో కూర్చుని ఉండగా ఆ బాలుడు ఆమె పాదాలకు ఎంతో భక్తి శ్రద్ధలతో మసాజ్ చేశాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై సదరు మహిళా టీచర్ స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది.


ఆమె మాట్లాడుతూ.. ‘నేను స్కూలు గేటు దగ్గర విరిగిపోయిన రాయిపై కాలు వేశాను. నా కాలు మడతపడి బెణికింది. నేను సరిగా నడవలేకుండా అయ్యాను. కుంటుకుంటూ నడుస్తున్న నాకు విద్యార్థులే సాయం చేశారు. తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. ఓ విద్యార్థి ఎంతో ప్రేమతో నా కాలికి మసాజ్ చేశాడు’ అని చెప్పుకొచ్చింది. కాగా, మధ్య ప్రదేశ్‌లోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ప్రవర్తన బాగోలేక సస్పెండ్ అయిన టీచర్లు చాలా మందే ఉన్నారు.


ఇవి కూడా చదవండి

డే కేర్ సెంటర్‌లో దారుణం.. చిన్నారిని చిత్ర హింసలు పెట్టిన మహిళా సిబ్బంది..

ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్.. ఆగస్టు 17 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు

Updated Date - Aug 11 , 2025 | 01:15 PM