Bear scared video: ఎలుగుబంటికి గుండె ఆగినంత పనైంది.. వీడియో చూస్తే నవ్వాపుకోవడం కష్టమే..
ABN , Publish Date - Nov 09 , 2025 | 08:43 AM
యూరప్ దేశాలలో ఎప్పట్నుంచో హాలోవీన్స్ సాంప్రదాయం కొనసాగుతోంది. విచిత్రమైన వేషధారణతో పార్టీల్లోనూ, రోడ్ల మీద తిరుగతూ సందడి చేస్తుంటారు. ఒకప్పుడు యూరప్ కంట్రీస్‌లో మాత్రమే కనిపించే ఈ ట్రెండ్ ఇప్పుడు ఇతర దేశాలకు సైతం వ్యాపించింది.
యూరప్ దేశాలలో ఎప్పట్నుంచో హాలోవీన్ సాంప్రదాయం కొనసాగుతోంది. విచిత్రమైన వేషధారణతో పార్టీల్లోనూ, రోడ్ల మీద తిరుగతూ సందడి చేస్తుంటారు. ఒకప్పుడు యూరప్ కంట్రీస్‌లో మాత్రమే కనిపించే ఈ ట్రెండ్ ఇప్పుడు ఇతర దేశాలకు సైతం వ్యాపించింది. భారత్‌లో కూడా ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో బాగా జోరందుకుంది. అలాంటి ఓ హాలోవీన్ పార్టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే నవ్వాపుకోవడం కష్టం (funny bear clip).
@NextSkillslevel అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంటి ఆవరణలో హాలోవిన్ గెటప్‌లో ఓ రిమోట్ కంట్రోల్డ్ బొమ్మను నిలబెట్టారు. అక్కడకు రాత్రి సమయంలో ఓ ఎలుగుబంటి వచ్చింది. ఆ బొమ్మ చూడడానికి మనిషి తరహాలో ఉండడంతో దగ్గరకు వెళ్లింది. ఆ మనిషి వాసన చూస్తోంది. ఆ సమయంలో ఆ బొమ్మలో లైట్లు వెలిగి, పెద్దగా అరుపులు వినిపించాయి. దీంతో ఆ ఎలుగుబంటికి గుండె ఆగినంత పనైంది. షాక్‌తో వెల్లకిలా పడిపోయింది (Halloween decorations prank).
కాసేపటికి తేరుకున్న ఎలుగుబంటి అది బొమ్మ అని తెలుసుకుని, కోపంగా పక్కకు నెట్టేసింది (bear reaction). ఆ వీడియో ఆ ఇంటి ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇది నిజమైనా వీడియోనా లేదా ఏఐ వీడియోనా అని చాలా మంది ప్రశ్నించారు. ఎలుగుబంటి కూడా అంతలా భయపడుతుందా అని మరొకరు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..
పక్షులు ఈమెతో మాట్లాడుతున్నాయ్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..