బాత్‌రూమ్... బేషుగ్గా...
ABN , Publish Date - Mar 02 , 2025 | 12:57 PM
కిచెన్, బెడ్‌రూమ్, లివింగ్‌రూమ్‌లకే కాదు... బాత్‌రూమ్ అవసరాలకు అనుగుణంగానూ కొన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి. కమోడ్‌ను పరిమళభరితంగా మార్చాలన్నా, టూత్‌పేస్ట్‌ను ట్యూబ్ నుంచి చివరికంటా నొక్కాలన్నా, స్నానం చేస్తూ సెల్‌ఫోన్ ఉపయోగించాలన్నా... ఇకపై అన్నీ చిటికెలో పనే. బాత్‌రూమ్‌ని బేషుగ్గా మార్చేసే అలాంటి కొన్ని క్రేజీ గ్యాడ్జెట్స్ ఇవి...
కిచెన్, బెడ్‌రూమ్, లివింగ్‌రూమ్‌లకే కాదు... బాత్‌రూమ్ అవసరాలకు అనుగుణంగానూ కొన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి. కమోడ్‌ను పరిమళభరితంగా మార్చాలన్నా, టూత్‌పేస్ట్‌ను ట్యూబ్ నుంచి చివరికంటా నొక్కాలన్నా, స్నానం చేస్తూ సెల్‌ఫోన్ ఉపయోగించాలన్నా... ఇకపై అన్నీ చిటికెలో పనే. బాత్‌రూమ్‌ని బేషుగ్గా మార్చేసే అలాంటి కొన్ని క్రేజీ గ్యాడ్జెట్స్ ఇవి...
టూత్‌పేస్ట్ చివరిదాకా...
టూత్‌పేస్ట్ అయిపోతే చేతులు నొప్పెట్టేదాకా ట్యూబ్‌ని గట్టిగా పిండుతుంటారు. అలాంటి ఇబ్బంది నుంచి కాపాడతాయి ‘టూత్‌పేస్ట్ స్క్వీజర్స్’ దీనికి ఉండే హ్యాండిల్ క్లిప్‌ని బయటకి తీసి, టూత్‌పేస్ట్ చివరి కొనకి తగిలించి, ఆపై స్క్వీజర్ బేస్‌లోకి ఇన్‌సెర్ట్ చేయాలి. హ్యాండిల్ క్లిప్‌ను ముందుకు తిప్పుతూ ఉంటే లోపలున్న టూత్‌పేస్ట్ నొక్కినట్లుగా బయటకి వస్తుంది.
జారిపడకుండా...
పెద్దవాళ్లలో చాలామంది బాత్‌రూమ్‌లో జారిపడ్డవారే ఉంటారు. అందుకే ‘బాత్‌రూమ్ హెల్పింగ్ హ్యాండిల్స్’ వచ్చాయి. వీటిని షవర్ కింద లేదా, కమోడ్ పక్కన తగిలిస్తే సరి. స్నానం చేసేటప్పుడు, కమోడ్‌పై కూర్చుని లేచేటప్పుడు జారిపోకుండా పట్టు ఉంటుంది. వీటికి ఎలాంటి ఇన్‌స్టాలేషన్ అక్కర్లేదు. స్విచ్ లాక్‌తో సులువుగా గోడకు అతుకుతుంది.

స్నానానికి థర్మామీటర్
బుజ్జాయిలకు స్నానం చేయించేటప్పుడు, వారి చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి... నీళ్లు ఎంత వేడిగా ఉన్నాయో చూడడానికి మాటిమాటికి బకెట్‌లో చెయ్యి పెట్టి చెక్ చేస్తుంటారు తల్లులు. అదే ‘షవర్ థర్మామీటర్’ ఉంటే వేడి విషయం అదే చూసుకుంటుంది. దీనిని షవర్ లేదా నల్లాకి బిగిస్తే, ఉష్ణోగ్రతతో పాటు, ఇండికేటర్ లైట్ కూడా వెలుగుతుంది. నీటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉంటే నీలం, 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటే ఆకుపచ్చ, 42 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉంటే ఎరుపు రంగు ఇండికేటర్ లైట్ వెలుగుతుంది. ఈ విధంగా జాగ్రత్తపడొచ్చు.
ఇంజెక్షన్ జెల్‌తో శుభ్రం
వాష్‌రూమ్‌లు, టాయిలెట్లు శుభ్రం చేయడమంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. జెల్ స్టిక్కర్‌తో ఆ పని సులువవుతుంది. ఇంజెక్షన్‌లాంటి పరికరం సాయంతో జెల్ స్టిక్కర్లని కమోడ్‌లో అతికిస్తే... నీళ్లని ఫ్లష్ చేసిన ప్రతీసారి ఈ స్టిక్టర్లు నెమ్మదిగా కరుగుతూ పరిమళభరిత రసాయనాలను విడుదల చేసి, కమో డ్‌ని శుభ్రం చేస్తాయి. ఒక్కో ఇంజెక్షన్‌లో పదకొండు జెల్ స్టిక్కర్లు ఉంటాయి. లావెండర్, లెమన్, జాస్మిన్ వంటి వివిధ పరిమళాల్లో లభిస్తాయి.
మొబైల్ తడవదు
కొంతమందికి పాటలు వింటూ స్నానం చేయడం అలవాటు. ‘ప్యాకెట్ షవర్ కర్టెన్’ ఉంటే పాటలే కాదు.. నచ్చిన వీడియోలు, సినిమాలు చూస్తూ కూడా స్నానం చేయొచ్చు. పిల్లలు, పెద్దలకు అందుబాటులో ఉండే విధంగా దీనికి తొమ్మిది నుంచి పన్నెండు ప్యాకెట్లు ఉంటాయి. వివిధ సైజుల్లో ఉండే వీటిల్లో మొబైల్, నోట్‌పాడ్ వంటి ఎలకా్ట్రనిక్ వస్తువులను పెట్టినా ఏం కాదు. నీళ్లు, సబ్బు నురగ పడుతుందనే బెంగ ఉండదు.