Share News

Rare pregnancy case: కడుపు నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన మహిళ.. స్కాన్‌ చేసిన డాక్టర్స్‌కు షాక్..

ABN , Publish Date - Dec 27 , 2025 | 07:05 PM

కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్‌కు చెందిన 41 ఏళ్ల నర్సు సూజ్ లోపెజ్‌ అనే మహిళ చాలా రోజులుగా అండాశయ తిత్తి సమస్యతో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఉదరం కాస్త పెద్దదిగా మారింది. గర్భాశయాన్ని స్కాన్ చేసి చూస్తే ఏమీ కనిపించలేదు. దీంతో తిత్తి పెరుగుతోందని ఆమె భావించి పట్టించుకోలేదు.

Rare pregnancy case: కడుపు నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన మహిళ.. స్కాన్‌ చేసిన డాక్టర్స్‌కు షాక్..
rare childbirth case

అమెరికాకు చెందిన ఆ మహిళ వయసు 41 ఏళ్లు.. ఆమె నర్సుగా పని చేస్తోంది.. కొద్ది రోజుల క్రితం ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది.. తట్టుకోలేక హాస్పిటల్‌కు వెళితే డాక్టర్లు స్కాన్ చేసి చూసి నివ్వెరపోయారు.. ఎందుకంటే ఆమె గర్భవతి.. ఆమె తనకు తెలియకుండానే తొమ్మిది నెలలుగా ఓ బిడ్డను మోసింది.. కారణమేంటంటే.. పిండం ఆమె గర్భసంచిలో కాకుండా అండాశయ తిత్తిలో పెరిగింది (baby growing outside uterus).


కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్‌కు చెందిన 41 ఏళ్ల నర్సు సూజ్ లోపెజ్‌ అనే మహిళ చాలా రోజులుగా అండాశయ తిత్తి సమస్యతో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఉదరం కాస్త పెద్దదిగా మారింది. గర్భాశయాన్ని స్కాన్ చేసి చూస్తే ఏమీ కనిపించలేదు. దీంతో తిత్తి పెరుగుతోందని ఆమె భావించి పట్టించుకోలేదు. ఎప్పట్నుంచో ఆమెకు రుతుచక్రం సక్రమంగా లేదు. అందువల్లే పీరియడ్స్ రావడం లేదని ఆమె భావించింది. ఆమెకు వాంతులు కాలేదు, వికారం అనిపించలేదు. భర్తతో కలిసి సాధారణ జీవితం గడిపింది. విదేశాలకు వెళ్లింది (medical miracle pregnancy).

patient2.jpg


ఒకరోజు ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది (abdominal pregnancy miracle). ఆమె తిత్తిని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించింది. డాక్టర్లు స్కాన్ చేసి చూసి షాకయ్యారు. గర్భాశయం పూర్తిగా ఖాళీగా ఉండటం కనిపించింది. కానీ, ఆమె అండాశయ తిత్తి లోపల పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువు ఉంది. వెంటనే ఆమెకు సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారు. సాధారణంగా గర్భాశయం వెలుపల గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం. అలాంటి సందర్భాలలో తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. వైద్య చరిత్రలో ఈ కేసు అత్యంత అరుదైనదని వైద్యులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

రైలు పట్టాల పక్కన సిల్వర్ పెట్టెలు ఎందుకుంటాయి.. వీటి ఉపయోగం ఏంటి..

మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 27 , 2025 | 07:05 PM