Share News

Mother Duck: జలపాతంలో పడిపోయిన పిల్ల బాతు.. తల్లడిల్లిన తల్లి బాతు ఏం చేసిందో తెలిస్తే..

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:32 PM

మనషుల్లోనే కాదు.. ఇతర జంతువుల్లో కూడా తల్లి ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది. కడుపున పుట్టిన బిడ్డ ప్రమాదంలో ఉంటే ఏ జంతువూ వెనకడుగు వేయదు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని తల్లి బాతును చూస్తే ఎమోషనల్ అవక తప్పదు.

Mother Duck: జలపాతంలో పడిపోయిన పిల్ల బాతు.. తల్లడిల్లిన తల్లి బాతు ఏం చేసిందో తెలిస్తే..
Baby duck fell down from a waterfall

ఈ ప్రపంచంలో అమ్మ (Mother) ప్రేమకు మించింది మరొకటి లేదు. బిడ్డకు ఏదైనా అయితే ఆ తల్లి హృదయం ముక్కలైపోతుంది. తన ప్రాణం అయినా సరే ఇచ్చి బిడ్డను కాపాడుకోవాలని తల్లి భావిస్తుంది. మనషుల్లోనే కాదు.. ఇతర జంతువుల్లో కూడా తల్లి ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది. కడుపున పుట్టిన బిడ్డ ప్రమాదంలో ఉంటే ఏ జంతువూ వెనకడుగు వేయదు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని తల్లి బాతు (Mother Duck)ను చూస్తే ఎమోషనల్ అవక తప్పదు.


@Rainmaker1973 అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ నదిలో ఓ తల్లి బాతు వెనుక పిల్లలు ఈదుకుంటూ వెళ్తున్నాయి. అంతలో వారికి ఓ ఆనకట్ట అడ్డు వచ్చింది. దీంతో తల్లి బాతు రూటు మార్చింది. పిల్లలు కూడా తల్లి వెనుకే తిరిగాయి. అయితే ఓ పిల్ల బాతు మాత్రం అదుపు తప్పి ఆ ఆనకట్టపై నుంచి కింద పడిపోయింది. ఆ పిల్ల బాతును కాసేపు తల్లి బాతు అలాగే చూస్తూ ఉండిపోయింది. సహాయం కోసం చుట్టూ చూసింది. చివరకు చేసేది లేక ఆ తల్లి బాతు కూడా ఆనకట్ట మీద నుంచి కిందకు దూకేసింది.


ఆ తల్లి బాతు వెనుకే మిగిలిన పిల్లలు కూడా ఆనకట్ట పై నుంచి కిందకు దూకేశాయి. తిరిగి అన్నీ కలుసుకుని ఆ నీటిలో ఈదుకుంటూ ముందుకు వెళ్లాయి. అక్కడకు వెళ్లిన పర్యాటకలు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద యోధురాలు తల్లి అని ఒకరు కామెంట్ చేశారు. పిల్లల బాధను తల్లి కంటే ఎవరూ అర్థం చేసుకోలేరని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. కళ్లెదురుగానే విచిత్రం.. క్షణాల్లో గేటు ఎలా మాయమైందో చూడండి..

మీది డేగ చూపు అయితే.. ఈ చెట్టుపై ఉన్న గుడ్లగూబను 8 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 16 , 2025 | 12:32 PM