Share News

Shocking Video: వామ్మో.. కళ్లెదురుగానే విచిత్రం.. క్షణాల్లో గేటు ఎలా మాయమైందో చూడండి..

ABN , Publish Date - Jul 16 , 2025 | 08:27 AM

ఫన్నీ, షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఆదరణ చూరగొంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ షాకింగ్ వీడియో చూస్తున్న వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వీడియోలో ఓ ఇంటి గేట్ కళ్లెదురుగానే మాయమైంది.

Shocking Video: వామ్మో.. కళ్లెదురుగానే విచిత్రం.. క్షణాల్లో గేటు ఎలా మాయమైందో చూడండి..
Shocking Video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫన్నీ, షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు ఆదరణ చూరగొంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ షాకింగ్ వీడియో చూస్తున్న వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వీడియోలో ఓ ఇంటి గేట్ (Gate) కళ్లెదురుగానే మాయమైంది.


@gharkekalesh అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. భారీ వర్షం (Rain) కురిసి ఆగిపోయిన తర్వాత రోడ్డుపై వరద నీరు వేగంగా ప్రవహిస్తోంది. ఓ కాలువ గట్టు మీద ఉన్న ఇంటి ప్రహారీ గోడ గేట్ దగ్గర ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. కొద్దిసేపటికి ఎవరూ తెరవకుండానే గేట్ తెరుచుకుంది. దీంతో ఆ గేట్ వేయడానికి ఆ వ్యక్తి వెళ్లాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఆ గేట్ గోడతో పాటు నీటిలో పడిపోయి కొట్టుకుని పోయింది. ఆ సమయంలో ఆ వ్యక్తి వెంటనే వెనక్కి పరిగెత్తుకుని రావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.


ఆ ఘటన ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు ఆరు లక్షల మందికి పైగా వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ గోడను ఎంత నాసిరకంగా కట్టారో అర్థమవుతోందని ఒకరు వ్యాఖ్యానించారు. కాలువ గట్టు మీదే ఇల్లు కడితే అలాగే ప్రమాదాలు సంభవిస్తాయని ఒకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఆ కుర్రాళ్లకు భయం లేదా.. భారీ కొండచిలువ పక్కనే ఉంటే..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో 998ల మధ్య 993 ఎక్కడుందో 6 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 16 , 2025 | 08:27 AM