Viral Video: ఈ సమయంలో కూడా అదేం పని ఆంటీ.. భర్త హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఆమె ఏం చేస్తోందో చూడండి..
ABN , Publish Date - Jul 12 , 2025 | 07:21 PM
రీల్స్ తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యూస్, లైక్స్ సంపాదించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఓ మధ్య వయసు మహిళ చేసిన పనిని చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఆమె భర్త హాస్పిటల్ బెడ్ మీద ఉండగా ఆమె అతడితో కలిసి రీల్స్ చేసింది.
ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్ కచ్చితంగా ఉంటోంది. దీంతో చాలా మంది సోషల్ మీడియాలో గంటల కొద్దీ సమయం వెచ్చిస్తున్నారు. రీల్స్ (Reels) తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యూస్, లైక్స్ సంపాదించాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఓ మధ్య వయసు మహిళ చేసిన పనిని చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఆమె భర్త హాస్పిటల్ బెడ్ (Hospital Bed) మీద ఉండగా ఆమె అతడితో కలిసి రీల్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది (Aunty Viral Video From Hospital).
himachalirareclips అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్నాడు. అతడి ఛాతీ భాగంపై వైర్లు అమర్చి ఉన్నాయి. నర్సు టెస్ట్ చేస్తోంది. ఆ పక్కనే ఉన్న అతడి భార్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన మొబైల్‌తో చక్కగా వీడియో తీసుకుంటోంది. సీరియస్ కండిషన్‌లో ఉన్న భర్త బెడ్ పక్కనే నిల్చుని వీడియో తీసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ ఈ వీడియోకు 63 వేలకు పైగా లైక్‌లు కూడా వచ్చాయి. రీల్ చేసిన ఆంటీని జనాలు ట్రోల్ చేస్తున్నారు. చావు బతుకుల్లో ఉన్న అతడికి భారీ ఇన్సూరెన్స్ ఉన్నట్టుంది అని ఒకరు కామెంట్ చేశారు. ఆంటీ.. మీరు మీ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారా అని మరొకరు ప్రశ్నించారు. ఇంత కంటే దారుణం మరొకటి ఉండదని ఇంకొకరు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త చావుబతుకుల్లో.. భార్య సోషల్ సోషల్ మీడియాలో.. అంటూ మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మీ భార్య ఇబ్బంది పెడుతోందా, మీరు లవ్ ఫెయిల్యూరా.. ఆ టీ స్టాల్‌లో టీ మీకోమే మరి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో భిన్నమైన టీ పాట్‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..