Aunty ji viral video: ఈ ఆంటీకి నోబుల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే.. ల్యాప్‌టాప్‌తో పూరీలు ఎలా చేస్తోందో చూడండి..
ABN , Publish Date - Sep 27 , 2025 | 06:58 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వీపరీతరంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫన్నీ జుగాడ్ వీడియోలు చాలా మందికి నచ్చుతున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వీపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫన్నీ జుగాడ్ వీడియోలు చాలా మందికి నచ్చుతున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ పూరీలు చేయడానికి వెరైటీ ట్రిక్ కనిపెట్టింది (making puri with laptop).
trollscroller అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (funny Indian video). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ పూరీలను చేస్తోంది. అయితే ఆ పూరీ ముద్దలను వత్తడానికి ఆమె ల్యాప్‌టాప్ వినియోగిస్తోంది. పూరీ ముద్దను ల్యాప్‌టాప్ కీబోర్డ్‌పై పెట్టి మూస్తోంది. దీంతో ఆ ముద్ద పూరీలా మారిపోతోంది. దానిని తీసి వేయించేస్తోంది. అలా చాలా వేగంగా ఆమె పూరీలను చేస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (creative cooking hack).
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు (aunty laptop puri). వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ల్యాప్‌టాప్‌ను ఈ మహిళ మాత్రమే సరిగ్గా వినియోగిస్తోందని ఒకరు సరదాగా కామెంట్ చేశారు. పూరీలను వత్తడానికి నేను కూడా ల్యాప్‌టాప్ కొనుక్కుంటానని మరొకరు కామెంట్ చేశారు. ఈ టెక్నాలజీ ఇండియా దాటి బయటకు వెళ్లకూడదని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
చిరుత పవర్ చూశారా? నీటిలోకి దూకి మొసలిని ఏం చేసిందో చూడండి..
ఈ ఫొటోలో చిలుక మాత్రమే కాదు.. బాటిల్ కూడా ఉంది.. 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..