Share News

Aunt Marries Nephew: భర్త ముందే మేనల్లుడ్ని పెళ్లి చేసుకున్న మహిళ..

ABN , Publish Date - Jun 21 , 2025 | 09:16 PM

Aunt Marries Nephew: జూన్ 15వ తేదీన ఆయుషీ.. సచిన్‌తో ఇంటినుంచి పారిపోయింది. భార్య లేచిపోయిన సంగతి భర్తకు తెలీదు. కనిపించకుండా పోయిందని మాత్రమే అనుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Aunt Marries Nephew: భర్త ముందే మేనల్లుడ్ని పెళ్లి చేసుకున్న మహిళ..
Aunt Marries Nephew

బీహార్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ మేనల్లుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది కూడా భర్త, కూతురి కళ్లముందే ప్రియుడితో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్, జమూయ్ జిల్లా, షిఖేరియా గ్రామానికి చెందిన విశాల్ దూబే, అదే గ్రామానికి చెందిన ఆయుషీ కుమారీకి 2021లో పెళ్లయింది. వారికి ఓ పాప కూడా పుట్టింది. పాప వయసు ప్రస్తుతం మూడు సంవత్సరాలు. రెండు సంవత్సరాల క్రితం ఆయుషీకి సోషల్ మీడియా ద్వారా సచిన్ దూబే అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సచిన్ దూబే వరుసకు ఆమెకు మేనల్లుడు అవుతాడు. తరచుగా ఇద్దరు చాటింగ్ చేసుకునే వారు. ఫోన్లలో మాట్లాడుకునే వారు.


కొంత కాలానికి ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. తరచుగా కలుసుకుంటూ ఉండేవారు. ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆయుషీపై ఎవ్వరికీ అనుమానం రాలేదు. అయితే, జూన్ 15వ తేదీన ఆయుషీ.. సచిన్‌తో ఇంటినుంచి పారిపోయింది. భార్య లేచిపోయిన సంగతి భర్తకు తెలీదు. కనిపించకుండా పోయిందని మాత్రమే అనుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ నేపథ్యంలోనే భార్య అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. జిల్లా కోర్టులో విడాకుల కోసం అప్లై చేసింది. తనకు కూతురు కూడా వద్దని తెగేసి చెప్పింది. శుక్రవారం సాయంత్రం రెండు కుటుంబాల అంగీకారంతో దేవుడి గుడిలో సచిన్, ఆయుషీ పెళ్లి చేసుకున్నారు. భర్త, కూతురి కళ్ల ముందే ఇద్దరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

కారు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్ నిద్ర.. పాపం కస్టమర్

రూ. 500 లంచం.. 30 ఏళ్ల తర్వాత రైతుకు న్యాయం..

Updated Date - Jun 21 , 2025 | 09:56 PM