Share News

Cab Driver: కారు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్ నిద్ర.. పాపం కస్టమర్

ABN , Publish Date - Jun 21 , 2025 | 08:03 PM

Cab Driver: అరోరా అనే 59 ఏళ్ల వ్యక్తి బెంగళూరు ట్రిప్‌కు సిద్దమయ్యాడు. ఉదయం 3.50 గంటలకు ఊబర్ కారులో ఇంటినుంచి ఎయిర్ పోర్టుకు బయలు దేరాడు. కొంత దూరం వరకు కారు బాగానే వెళ్లింది.

Cab Driver: కారు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్ నిద్ర.. పాపం కస్టమర్
Cab Driver

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇక్కడ దారుణం ఏంటంటే.. ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరో బలవుతున్నారు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఓ క్యాబ్ డ్రైవర్ చేసిన తప్పుకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళుతుండగా .. కారు నడుపుతూ ఆ డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. కస్టమర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నోయిడా, సెక్టార్ 35లోని గరిమ విహార్‌కు చెందిన రాకేష్ అరోరా అనే 59 ఏళ్ల వ్యక్తి బెంగళూరు ట్రిప్‌కు సిద్దమయ్యాడు. ఉదయం 3.50 గంటలకు క్యాబ్లో ఇంటినుంచి ఎయిర్ పోర్టుకు బయలు దేరాడు. కొంత దూరం వరకు కారు బాగానే వెళ్లింది. ఆ తర్వాత డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. కారు ఢిల్లీ నోయిడా డైరెక్ట్ ఫ్లైవే దగ్గరకు రాగానే స్టేషనరీ టెంపోను ఢీకొట్టింది. ఉదయం 4.15 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది.


ఈ ప్రమాదంలో కారు డ్రైవర్, రాకేష్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ ఏఐఐఎమ్‌ఎస్‌కు తరలించారు. రాకేష్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. క్యాబ్ డ్రైవర్‌కు చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ..‘క్యాబ్ డ్రైవర్ స్టేట్‌మెంట్ ఇచ్చే స్థితిలో లేడని డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగినపుడు చూసిన వాళ్లు ఎవ్వరూ లేరు. డ్రైవర్ కోలుకుంటే ఏం జరిగిందో తెలుస్తుంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

తప్ప తాగి ఒంటెపై సవారీ.. మృత్యు దారిలో పరుగో పరుగు..

2 నెలలుగా కనిపించని మహిళ.. ఇంటి ముందు గొయ్యి తవ్వి చూస్తే..

Updated Date - Jun 21 , 2025 | 08:44 PM