Angry Youth Cuts Power: కరెంట్ వైర్లు కట్ చేసిన యువకుడు.. అసలు స్టోరీ ఇదే..
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:54 PM
ప్రియురాలి మీద కోపంతో రగిలిపోయాడు. అయితే, ప్రియురాలిని ఏమీ చేయలేక పిచ్చి పనికి తెరతీశాడు. దగ్గరలోని ఓ కరెంట్ స్తంభాన్ని ఎక్కాడు. తన వెంట తెచ్చుకున్న కట్టర్‌తో వైర్లు కట్ చేశాడు.
ఓ యువకుడు కరెంట్ స్తంభంపైకి ఎక్కి వైర్లు కట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు బాగా పెరిగిపోయాయి. అయితే, ఆ యువకుడు అలా కరెంట్ వైర్లు కట్ చేయటం వెనుక అసలు కారణం ఏంటో తెలిసిపోయింది. ఆ వీడియోలో ఉన్న యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరిదీ టూ సైడ్ లవ్. ఇద్దరూ తరచుగా ఫోన్లలో మాట్లాడుకునే వారు.
బయట కలుసుకునే వారు. కొద్దిరోజుల క్రితం ఆ యువకుడు తన లవర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ బిజీ వచ్చింది. కొద్దిసేపు ఆగి మళ్లీ ఫోన్ చేశాడు. మళ్లీ బిజీ వచ్చింది. దీంతో అతడి కోపం కట్టలు తెంచుకుంది. ప్రియురాలి మీద కోపంతో రగిలిపోయాడు. అయితే, ప్రియురాలిని ఏమీ చేయలేక పిచ్చి పనికి తెరతీశాడు. దగ్గరలోని ఓ కరెంట్ స్తంభాన్ని ఎక్కాడు. తన వెంట తెచ్చుకున్న కట్టర్‌తో వైర్లు కట్ చేశాడు. ఊరు మొత్తానికి కరెంట్ లేకుండా చేశాడు.
ఆ యువకుడు ఎవరు? ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్నది తెలియరాలేదు. ఓ వ్యక్తి దాన్నంతా వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘సయ్యారా సినిమా చూసి బాగా స్పూర్తి పొందినట్లు ఉన్నాడు. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు’..‘నీ ఆవేశం తగలెయ్యా.. లవర్ మీద కోపంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
లావణ్య ఫిర్యాదు.. హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు
త్వరగా కోటీశ్వరులు కావాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి..