Radhika Sarathkumar Breaks Down: తల్లి మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్
ABN , Publish Date - Sep 22 , 2025 | 02:03 PM
తల్లి మరణంతో రాధిక కుదేలయ్యారు. ఎమోషనల్‌గా ఢీలా పడిపోయారు. తల్లి భౌతికకాయం ముందు నిల్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రాధిక చెల్లెలు నిరోష పరిస్థితి కూడా అలానే ఉంది.
చెన్నై: ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తల్లి గీత కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె 86 ఏళ్ల వయసులో ఆదివారం రాత్రి చనిపోయారు. ఈ రోజు (సోమవారం)సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలోని బసంత్ నగర్ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గీత భౌతికకాయాన్ని పోయస్ గార్డెన్‌లోని రాధిక ఇంట్లో బంధువులు, స్నేహితుల సందర్శన కోసం ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు రాధిక ఇంటికి వెళుతున్నారు.
రాధికను పరామర్శిస్తున్నారు. గీత భౌతికదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. తల్లి మరణంతో రాధిక కుదేలయ్యారు. ఎమోషనల్‌గా ఢీలా పడిపోయారు. తల్లి భౌతికకాయం ముందు నిల్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రాధిక చెల్లెలు నిరోష పరిస్థితి కూడా అలానే ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో నిరోష సీనియర్ నటుడు నాజర్ దగ్గర వెక్కి వెక్కి ఏడ్చారు. ఆయన ఆమెను ఓదార్చారు.
రాధిక ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు..
రాధిక కుటుంబం మొత్తం సినిమాల్లోనే ఉన్నారు. రాధిక తండ్రి ఎమ్ఆర్ రాధ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా చిరస్మరణీయుడు. ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయనకు ఐదుగురు భార్యలు. ఐదో భార్య గీత. ఈమె పిల్లలే రాధిక, నిరోష. రాధిక సోదరులు రాధా రవి, ఎమ్ఆర్ఆర్ వాసులు కూడా ప్రముఖ నటులే. తండ్రి వారసత్వంతోనే రాధిక చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా దశాబ్ధాల పాటు వెలుగొందారు.
ఇవి కూడా చదవండి
స్పైడర్ మ్యాన్ షూటింగ్‌లో ప్రమాదం.. హీరో తలకు గాయం..
విజయ్ ర్యాలీకి వచ్చిన జనాల గురించి కమల్ హాసన్ కామెంట్స్