Tom Holland Hospitalised: స్పైడర్ మ్యాన్ షూటింగ్‌లో ప్రమాదం.. హీరో తలకు గాయం..
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:47 PM
ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. హీరో టామ్ హాలాండ్ తలకు గాయం అయింది. గాయం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సామ్ రైమీ, టోబే మాగైర్ కాంబినేషన్‌లో 2002లో వచ్చిన ‘స్పైడర్ మ్యాన్’ మూవీతో స్పైడర్ మ్యాన్ ప్రాంఛైజీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ మొదలైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం టామ్ హాలాండ్ హీరోగా స్పైడర్ మ్యాన్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. టామ్ హాలాండ్ హీరోగా ఇప్పటి వరకు రెండు స్పైడర్ మ్యాన్ సినిమాలు వచ్చాయి. ‘స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్.. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ సినిమాలు తెరకెక్కాయి.
ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. హీరో టామ్ హాలాండ్ తలకు గాయం అయింది. గాయం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. హార్ట్‌ఫోర్‌షైర్, వాట్‌ఫోర్డ్‌లో ఉన్న లీవెస్‌డెన్ స్టూడియోస్‌లో షూటింగ్ జరుగుతూ ఉంది. టామ్ పైనుంచి కిందపడిపోయారు. తలకు గాయం అవ్వటంతో అంబులెన్స్‌లో ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. టామ్‌కు స్టంట్ డబుల్‌గా చేస్తున్న ఓ మహిళ కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
ఆమెను కూడా ఆస్పత్రికి తరలించారు. టామ్ ఆస్పత్రి పాలు కావటంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. మరికొన్ని రోజుల్లో టామ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ప్రొడక్షన్ హౌస్ ఈ ఆలస్యం కారణంగా ఓవర్‌ఆల్ ప్రొడక్షన్ టైమ్ లైన్ ఎఫెక్ట్ కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, బ్రాండ్ న్యూడే షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం అయింది. 2026, జులై 31వ తేదీన సినిమా విడుదల అవ్వనుంది. తాజాగా చోటుచేసుకున్న ప్రమాదం వల్ల విడుదల తేదీలో మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
పోలీసులు పట్టుకున్నా భయపడలేదు.. ఏకంగా పోలీస్ జీప్‌పైకి ఎక్కి..
మెడికల్ కాలేజీ అంశంపై మరోసారి వైసీపీ నిరసన..