Share News

Ants Video: వావ్.. ఈ చీమలు, పురుగులను చూడండి.. ఎలా ముందుకు వెళుతున్నాయో

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:51 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇతర జీవులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Ants Video: వావ్.. ఈ చీమలు, పురుగులను చూడండి.. ఎలా ముందుకు వెళుతున్నాయో
Ants Video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇతర జీవులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో కొన్ని చీమలు, పురుగుల తీరు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Viral Video).


@wonderofscience అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ప్రాంతంలో పురుగులు, చీమలు క్రమశిక్షణతో వరుసగా వెళ్తున్నాయి. ఒకవైపు పురుగులు, మరోవైపు చీమలు వరుసగా వెళ్తున్నాయి. అయితే సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ లాగా.. అటు చీమలు, ఇటు పురుగులు సెక్యూరిటీగా నిల్చున్నాయి. పురుగుల వైపు చీమలు, చీమల వైపు పురుగులు వెళ్లకుండా ఎలాంటి హానీ జరగకుండా కాపలా కాస్తున్నాయి.


ఆ దృశ్యం చూస్తుంటే ఆర్మీ పరేడ్‌ చూస్తున్నట్టుగా ఉంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దాదాపు 2.3 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. కొన్ని వేల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

వావ్.. సూపర్ ఐడియా.. వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. వీడియో వైరల్

మీ కళ్లు ఎంతో పవర్‌ఫుల్ అయితేనే.. ఈ ఫొటోలో సూదిని 10 సెకెన్లలో కనిపెట్టండి


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 11:51 PM