Share News

Careless mistake: చిన్న తప్పు ఎంత పెద్ద ప్రమాదానికి కారణమైందో చూశారా.. షాకింగ్ వీడియో వైరల్..

ABN , Publish Date - Nov 01 , 2025 | 07:06 PM

మనం నిర్లక్ష్యంగా చేసే చిన్న తప్పులు పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా కరెంట్ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. అనవసరంగా భారీ మూల్యం చెల్లిస్తుంటారు.

Careless mistake: చిన్న తప్పు ఎంత పెద్ద ప్రమాదానికి కారణమైందో చూశారా.. షాకింగ్ వీడియో వైరల్..
awareness campaign

మనం నిర్లక్ష్యంగా చేసే చిన్న తప్పులు పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా కరెంట్ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. అనవసరంగా భారీ మూల్యం చెల్లిస్తుంటారు. ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. ఆ వీడియోలో ఓ యువతి మొబైల్ ఛార్జర్‌తో ఆటలాడి పెద్ద ప్రమాదానికి గురైంది (safety awareness).


@diilkibaat అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ గదిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఆ వీడియో రికార్డ్ అయినట్టు తెలుస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి తన మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టింది. ఛార్జింగ్ పెట్టినప్పటికీ ఆ మొబైల్‌కు ఛార్జింగ్ ఎక్కినట్టు లేదు. దీంతో పలుసార్లు ఛార్జింగ్ పిన్ తీసి మళ్లీ తిరిగి పెట్టింది. కరెంట్ స్విచ్ ఆఫ్ చేసి, ఆన్ చేసింది. అయినప్పటికీ ఆ మొబైల్‌కు ఛార్జింగ్ ఎక్కడం లేదు. దీంతో ఆ ఛార్జింగ్ పిన్ తీసుకుని తన నోటిలో పెట్టుకుని చెక్ చేయాలనుకుంది (Mobile Charging accident).


ఆ ఛార్జింగ్ పిన్‌కు తడి తగలడంతో ఆమెకు షాక్ కొట్టింది (life safety). ఆమె విద్యుదాఘాతానికి గురై కింద పడి స్పృహ కోల్పోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను 3.6 లక్షల మందికి పైగా వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. అది నిజమైనా వీడియోనేనా లేదా రీల్స్ కోసం రూపొందించినదా అని ఒకరు ప్రశ్నించారు. మొబైల్ ఛార్జింగ్ చాలా తక్కువ కరెంట్‌నే తీసుకుంటుందని, ఆ స్థాయిలో షాక్ కొట్టేంత కరెంట్ ఆ ఛార్జర్ ద్వారా సప్లై అవదని ఒకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

స్లీపర్ బస్ ఎక్కుతున్నారా? ముందు ఈ విషయాల గురించి తెలుసుకోండి..


మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో ఏనుగును 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 01 , 2025 | 07:06 PM