Share News

King cobra: వామ్మో.. ఇతడి గుండె ధైర్యానికి సలాం చెప్పాల్సిందే.. కింగ్ కోబ్రా నిజమైన సైజ్ ఎంతంటే..

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:48 PM

అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను చూస్తే చాలు ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి ఎలాంటి భయమూ లేకుండా తన చేతులతో భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. ఆ వీడియోలోని కింగ్ కోబ్రా భారీ సైజ్ చూస్తే వెన్నులో వణుకు రావడం ఖాయం.

King cobra: వామ్మో.. ఇతడి గుండె ధైర్యానికి సలాం చెప్పాల్సిందే.. కింగ్ కోబ్రా నిజమైన సైజ్ ఎంతంటే..
Massive King Cobra

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే (Snakes) భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అలాంటిది అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా (King cobra)ను చూస్తే చాలు ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి ఎలాంటి భయమూ లేకుండా తన చేతులతో భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. ఆ వీడియోలోని కింగ్ కోబ్రా భారీ సైజ్ చూస్తే వెన్నులో వణుకు రావడం ఖాయం (Massive King Cobra Video).


ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి @ParveenKaswan తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి అత్యంత భారీగా ఉన్న కింగ్ కోబ్రాను తన చేతులతో పట్టుకుని నిల్చున్నాడు. ఆ వీడియోను షేర్ చేసిన ప్రవీణ్.. 'కింగ్ కోబ్రా నిజంగా ఎంత భారీగా ఉంటుందో తెలుసా? ఇంత భారీ కింగ్ కోబ్రా భారత్‌లో ఎక్కడుంటుందో తెలుసా? అలాంటి భారీ కింగ్ కోబ్రాను చూస్తే మీరేం చేస్తారు' అని ఆయన కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు.


ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. 'నేను అలాంటి ఓ భారీ కింగ్ కోబ్రాను చూశాను. దాని పొడవు 17 అడుగులకు పైనే ఉంటుంది. ఇంకెప్పుడూ అలాంటి దానిని చూడాలనుకోలేదు' అంటూ ఒకరు కామెంట్ చేశారు. భారత్‌లో ఇలాంటి కింగ్ కోబ్రాలు తూర్పు, పశ్చిమ కనుమలతో పాటు అసోం, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కనిపిస్తాయి. వాటి పొడవు సరాసరి 18 అడుగులు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత సర్పం కింగ్ కోబ్రా. ఇవి సాధారణంగా జనావాసాల సమీపంలోకి రావు.


ఇవి కూడా చదవండి..

ఇదేం ఆత్రం బాబాయ్.. మద్యం షాప్‌నకు వెళ్లి అతడు చేసిన పని చూస్తే నవ్వకుండా ఉండలేరు..


ఈ ఫొటోలో పక్షిని కనిపెట్టగలిగితే.. మీ కళ్ల గురించి ఆలోచించనక్కర్లేదు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 09 , 2025 | 05:48 PM