Share News

Dangerous stunt: ఇంత రిస్క్ అవసరమా బ్రో.. ఇతడు ఎంత ప్రమాదకర స్టంట్ చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Nov 23 , 2025 | 08:36 PM

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

Dangerous stunt: ఇంత రిస్క్ అవసరమా బ్రో.. ఇతడు ఎంత ప్రమాదకర స్టంట్ చేస్తున్నాడో చూడండి..
railway bridge stunt

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (railway bridge stunt).


@fitneeskit అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (man dangling from bridge). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి రైల్వే వంతెన పైన, కింద ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నాడు. మొదట అతడు పట్టాల మధ్య నిలబడి ప్రమాదకర వ్యాయామం చేశాడు. ఆ తర్వాత మరింత ప్రమాదకరంగా వంతెన కింద వేలాడుతూ పుల్-అప్‌లు చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. 'గేమ్ ఆఫ్ డెత్... ట్రై చేసి చూపించు' అని కామెంట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ ప్రమాదకర స్టంట్ వీడియోను వేల మంది వీక్షించారు (viral risky reel). వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. రైల్వే ట్రాక్‌లు, వంతెనలపై ఇటువంటి చర్యలు చట్టపరంగా నేరం, ప్రాణాంతకం అని ఒకరు కామెంట్ చేశారు. అతడు చేయడమే కాకుండా ఇతరులకు సవాలు విసరడం మరింత హేయం అని మరొకరు విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

ఈ ఆంటీ తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో కోతులకు ఎలా చెక్ పెట్టిందో చూడండి..


ఐర్లాండ్ వాసులకు నిద్రలేకుండా చేసిన సింహం.. తీరా అసలు విషయం తెలిసి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 23 , 2025 | 09:50 PM