Share News

3 Year Old Child: మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఈ వీడియోనే ఉదాహరణ..

ABN , Publish Date - Dec 03 , 2025 | 09:48 PM

మూడేళ్ల ఓ బాలుడు అర్థరాత్రి వేళ రోడ్డుపైకి వచ్చేశాడు. ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక అల్లాడిపోయాడు. ఆ బాలుడికి ఇద్దరు మనసున్న వ్యక్తులు సాయం చేశారు. మొత్తానికి బాలుడు ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

3 Year Old Child: మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఈ వీడియోనే ఉదాహరణ..
3 Year Old Child

మానవత్వం ఇంకా బతికే ఉందని తెలిపే సంఘటన ఒకటి చైనాలో చోటుచేసుకుంది. అర్థరాత్రి దారి తప్పి రోడ్డుపైకి వచ్చిన పసి బాలుడికి ఇద్దరు వ్యక్తులు సాయం చేశారు. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ బాలుడ్ని రక్షించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన మూడేళ్ల బాలుడు అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో రోడ్డుపైకి వచ్చేశాడు. జంక్షన్‌లోకి అడుగుపెట్టాడు. వేగంగా నడుస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. వాహనాలు వేగంగా అటు, ఇటు వెళుతూ ఉన్నాయి. కొంచెం ఉంటే బాలుడు ఏదో ఒక వాహనం కిందపడేవాడు.


కాళ్లకు చెప్పులు లేకపోవటం.. విపరీతంగా చలి ఉండటంతో బాలుడు ఏడుస్తూ ముందుకు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్ దేవుడిలా అక్కడికి వచ్చాడు. స్కూటీ ఆపి బాలుడ్ని తన దగ్గరకు పిలిచాడు. చిన్నారిని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. చలికి ఇబ్బందిపడుతున్న బాలుడ్ని అటు వైపు వచ్చిన కారులోకి చేర్చాడు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. కారు యజమాని పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. బాలుడ్ని స్వాధీనం చేసుకున్నారు.


చిన్నారి తల్లిదండ్రులు ఎవరో కనుక్కుని వారి వద్దకు చేర్చారు. బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డకు సాయం చేసిన డెలివరీ బాయ్, కారు యజమానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక, పోలీసులు ఆ ఇద్దరు మనసున్న వ్యక్తులకు సన్మానం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. వీడియోపై స్పందించిన ఓ నెటిజన్.. ‘ఇదే గనుక అమెరికాలో జరిగి ఉంటే ఆ తల్లిదండ్రులను అరెస్ట్ చేసేవారు. బాలుడ్ని పోస్టర్ హోమ్‌కు పంపేవారు’ అంటూ కామెంట్ పెట్టాడు.


ఇవి కూడా చదవండి

మీ స్కిల్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 65 సెకెన్లలో కనిపెట్టండి

గంటకు 5 నిమిషాలు వాకింగ్ చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు

Updated Date - Dec 03 , 2025 | 09:52 PM