Zubeen Garg Escaped: అప్పుడు తప్పించుకున్నాడు.. 23 ఏళ్ల తర్వాత అనుకోని విధంగా..
ABN , Publish Date - Sep 20 , 2025 | 08:17 AM
2002 జనవరి 12వ తేదీన అస్సాంలోని సోనిపత్ జిల్లాలో జుబీన్ సోదరి జోంకీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్లి ఓ ట్రక్కును ఢీకొట్టింది.
ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గర్గ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యా డు. 52 ఏళ్ల వయసులో అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. జుబీన్ మరణంతో అస్సామీ చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్‌లోనూ తీవ్ర విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జుబీన్ మరణంపై స్పందించారు. ‘ ప్రముఖ సింగర్ జుబీన్ గర్గ్ హఠాత్మరణం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. సంగీతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని పేర్కొన్నారు.
అప్పుడు తప్పించుకున్నారు.. ఇప్పుడిలా..
జుబీన్ గర్గ్ 23 ఏళ్ల క్రితం చావునుంచి తప్పించుకుని బయటపడ్డాడు. ఓ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆయన సోదరి చనిపోయింది. 2002 జనవరి 12వ తేదీన అస్సాంలోని సోనిపత్ జిల్లాలో జుబీన్ సోదరి జోంకీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్లి ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జోంకీ అక్కడికక్కడే చనిపోయింది. అదృష్టం కొద్ది జుబీన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందు వరకు జుబీన్ తన సోదరితో పాటు ఒకే కారు ప్రయాణిస్తూ ఉన్నాడు.
ప్రమాదం జరిగే ముందు కారు మారాడు. అదే ఆయన ప్రాణాలు కాపాడింది. సోదరి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమె చనిపోయింది. జుబీన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, విషాదం పోస్టుపోన్ అయింది కానీ, ఆగలేదు. 23 ఏళ్ల తర్వాత జుబీన్ నీటి ప్రమాదంలో చనిపోయాడు. శుక్రవారం స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. సముద్రంలో కొట్టుకుపోయాడు. రెస్క్యూ సిబ్బంది ఆయన్ని కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. కాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హృతిక్ రోషన్ మూవీ క్రిష్ 4లో జుబీన్ ఓ పాట పాడినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
72 ఏళ్ల వృద్ధుడితో 27 ఏళ్ల యువతి పెళ్లి.. ఇండియాకు వచ్చి మరీ..