Share News

Himachal Pradesh: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు హఠాత్తుగా ప్రత్యక్షం

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:48 PM

హిమాచల్ ప్రదేశ్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 15 సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన కొడుకు తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

Himachal Pradesh: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు హఠాత్తుగా ప్రత్యక్షం
Himachal Pradesh

ఒకటి కాదు.. రెండు కాదు.. 15 ఏళ్లుగా కనిపించకుండా పోయిన తన కొడుకు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసింది తల్లి. కొడుకు ఆచూకీ లేదు.. అసలు ఉన్నాడో లేదో తెలియదు. దీంతో అందరూ చనిపోయి ఉంటాడని భావించి ఆశ వదులుకున్నారు. అలాంటిది 15 ఏళ్ల క్రితం అదృశ్యమైన కొడుకు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఊరు ఊరంతా ఆ వ్యక్తికి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.


హిమాచల్ ప్రదేశ్‌లోని హమీన్‌పూర్ జిల్లా గొర్తోలీ గ్రామానికి చెందిన బల్‌దేవ్ కుమార్ ఓ మాజీ సైనికుడు కుమారుడు. 15 ఏళ్ల క్రితం జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF) కి సెలక్ట్ అయ్యాడు. ఉద్యోగంలో చేరడానికి ఢిల్లీ బయలుదేరాడు బల్‌దేవ్. ఇంటి నుంచి బయలుదేరి చాలా కాలం అయినా అతని నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు కలత చెందారు. బల్‌దేవ్ గురించి ఆరా తీయగా ఉద్యోగంలో చేరలేదని తెలిసింది. బల్‌దేవ్ తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడ వెతికినా అతని జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో తమ కొడుకు చనిపోయి ఉంటాడని విషాదంలో మునిగిపోయారు. మూడు రోజుల క్రితం, రాజస్థాన్‌లోని బికనీర్‌లోని ఒక కుటుంబం గుర్తు తెలియని వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, అతని గుర్తింపును కోరింది.


ఆ వీడియో సుజన్‌పూర్‌లోని సప్నా కుమారికి చేరింది. ఆమె కూడా ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అలా ఆ వీడియో బల్ దేవ్ కుటుంబానికి చేరి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వీడియోలో ఉన్న ఆ వ్యక్తి 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కొడుకుగా గుర్తించారు. వెంటనే బికనీర్ కి వెళ్లి తమ కొడుకును చూసి మురిసిపోయారు. బల్ దేవ్ కుమార్ ని సుజన్‌పూర్ జిల్లాలో గొర్తోలీ గ్రామానికి తీసుకువచ్చారు. బాణా సంచా పేల్చుతూ, డప్పులు వాయిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. సోషల్ మాధ్యమం ద్వారా తమ కొడుకును తమ దగ్గరకు చేర్చిన స్వప్న కుమారి, గౌరవ్ జైన్ కి కుటుంబ సభ్యులు కృతజ్ఞతు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Drunk Woman Rapido Ride: తప్పతాగి ర్యాపిడో బైక్ ఎక్కిన యువతి.. తర్వాత ఏం జరిగిందంటే..

Funny student video: అమ్మాయితో కలిసి కాలేజ్ నుంచి పారిపోదామనుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Updated Date - Dec 09 , 2025 | 04:07 PM