పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఏం చెప్పిందంటే..
ABN , First Publish Date - Nov 28 , 2025 | 07:08 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 28, 2025 20:56 IST
వరంగల్: కాళోజీ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డా.నందకుమార్ రాజీనామా
వర్సిటీలో ఇటీవల జరిగిన అవకతవకల్లో నందకుమార్‌పై తీవ్ర ఆరోపణలు
పరీక్ష పేపర్ల మూల్యాంకనం, ఇన్‌ఛార్జ్‌ల నియామకంలో అవకతవకలు
కాళోజీ యూనివర్సిటీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరిన రేవంత్ రెడ్డి
కాసేపటికే వీసీ నందకుమార్ రాజీనామా చేసినట్లు ప్రకటన
-
Nov 28, 2025 20:12 IST
లిక్కర్ కేసులో కసిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు
కసిరెడ్డి నేరానికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయి: సిద్ధార్థ లూథ్రా
లిక్కర్ కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి విదేశాలకు తరలించారు
ప్రభుత్వ ఖజానాకు రూ.3,200కోట్లు నష్టం చేశారు: సిద్ధార్థ లూథ్రా
-
Nov 28, 2025 20:08 IST
హైదరాబాద్: రేపటి నుంచి అందుబాటులోకి మల్టీ లెవెల్ పార్కింగ్
రేపటి నుంచి KBR పార్క్ దగ్గర మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రారంభం
నగరంలో ఇదే మొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్
ఒకేసారి 72 కార్లను పార్కింగ్ చేసే సదుపాయం
-
Nov 28, 2025 19:44 IST
రైతుల అభ్యంతరాలను గతంలో అధికారులు సరిగా డీల్ చేయలేదు: సీఎం
నిన్న నేను మాట్లాడిన తర్వాతే రైతులు భూసమీకరణకు ఒప్పుకున్నారు
అమరావతికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది: సీఎం చంద్రబాబు
ఎయిర్‌పోర్టు, ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డు, రైల్వేస్టేషన్,..
స్పోర్ట్స్ సిటీ, నాచురోపతి మెడికల్ కాలేజీ నిర్మిస్తాం: చంద్రబాబు
కళాశాల నిర్మాణానికి అమరావతిలో భూమి ఇస్తాం: చంద్రబాబు
రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి: చంద్రబాబు
PPP మోడల్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రెండేళ్లలో పూర్తి చేస్తాం
పోలవరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలి: సీఎం చంద్రబాబు
రాబోయే తుఫాన్‌లో తక్కువ నష్టం ఉండేలా చర్యలు చేపట్టాలి
ఆయా జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులు వెళ్లాలి: సీఎం చంద్రబాబు
-
Nov 28, 2025 19:36 IST
నంద్యాల: నందికొట్కూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో బాలిక ప్రసవం
కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలికకు పురిటినొప్పులతో ప్రసవం
పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆసుపత్రి యాజమాన్యం
విచారణ జరుపుతున్న పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు
-
Nov 28, 2025 19:36 IST
హైదరాబాద్: కోకాపేట నియోపోలీస్ భూములకు రికార్డు ధరలు
ముగిసిన రెండో విడత ఈ-వేలం ప్రక్రియ
ప్లాట్ నెంబర్ 15 లో ఎకరానికి 151 కోట్ల 25 లక్షలు పలికిన ఎకరం ధర
ప్లాట్ నెంబర్ 16 లో 147 కోట్ల 75 లక్షలు పలికిన ఎకరం ధర...
రెండో విడత వేలంలో 9.06 ఎకరాల భూమికి గాను 1,352కోట్లు పొందిన HMDA
ప్లాట్ నెంబర్ 15 లో 4.03 ఎకరాలకు గాను 609 కోట్ల 55 లక్షలు పొందిన HMDA
ప్లాట్ నెంబర్ 16 లో 5.03 ఎకరాలకు గాను 743 కోట్లు పొందిన HMDA
-
Nov 28, 2025 17:23 IST
డిసెంబర్ 1నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు
డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్
డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం
డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్
డిసెంబర్ 4న ఆదిలాబాద్
డిసెంబర్ 5న నర్సంపేట
డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ
-
Nov 28, 2025 16:11 IST
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త
విమానాల్లో చెకింగ్ లేకుండా ఇరుముడి తీసుకెళ్లేందుకు వెసులుబాటు
ఇవాళ్టి నుంచి జనవరి 20 వరకు వర్తింపు
ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలి: రామ్మోహన్
-
Nov 28, 2025 16:04 IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం
తల్లి మరణాన్ని తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య
నిన్న మానేరు వాగులో దూకి తల్లి లలిత ఆత్మహత్య
తల్లి మృతదేహాన్ని చూసి అదే వాగులో దూకి అభిలాష్ ఆత్మహత్య
సర్దాపూర్ 17 బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అభిలాష్
-
Nov 28, 2025 14:26 IST
హైదరాబాద్: BRS దీక్షా దివాస్‌కు కాంగ్రెస్ కౌంటర్
కేసీఆర్ దొంగ దీక్ష చేశారని కాంగ్రెస్ ఆరోపణ
దీక్ష సమయంలో కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పటి..
మెడికల్ రిపోర్ట్స్ బయటపెట్టిన కాంగ్రెస్
-
Nov 28, 2025 14:26 IST
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, తెలంగాణ ఈగల్ టీమ్ సంయుక్త ఆపరేషన్
డ్రగ్స్ సరఫరా చేస్తున్న 10 మంది నైజీరియన్లు అరెస్ట్
తెలంగాణలో ఏడుగురు, ఢిల్లీలో ముగ్గురు. మరో చోట ఒకరు అరెస్ట్
రూ.12కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం: ఈగల్ టీమ్ ఎస్పీ
వీసా గడువు ముగిసిన మరో 40 మందిని అదుపులోకి తీసుకున్నాం
గార్మెంట్స్, కాస్మోటిక్స్, షూస్‌లో డ్రగ్స్ పెట్టి డెలివరీ చేస్తున్నారు
తెలంగాణలో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేశాం: సీతారాం
-
Nov 28, 2025 13:09 IST
అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిది: కేంద్రమంత్రి నిర్మల
ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదు: నిర్మల
ఆర్థిక తోడ్పాటు అందించాలనే 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు
ఒకేచోట ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదు
భవిష్యత్‌లో రాజధాని నిర్మాణమంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారు
రాజధాని నిర్మాణానికి భూములిచ్చి రైతులు పెద్ద త్యాగం చేశారు: నిర్మల
రైతులకు సమస్యలు రాకుండా సేవలందించడం బ్యాంకుల ప్రథమ బాధ్యత
-
Nov 28, 2025 11:15 IST
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఏం చెప్పిందంటే..
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు
ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదు: ఈసీ అడ్వొకేట్
పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించమని మేమే చెప్పాం కదా: హైకోర్టు
-
Nov 28, 2025 10:23 IST
హైదరాబాద్: గన్ మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
గన్ మిస్సింగ్‌పై పొంతన లేని సమాధానాలు చెబుతున్న ఎస్సై భానుప్రకాశ్ రెడ్డి
ఎక్కడ పెట్టానో గుర్తులేదంటూ ఎస్‌ఐ భానుప్రకాష్ సమాధానం
ఐదు నెలల క్రితమే తుపాకీని మిస్ చేసిన భానుప్రకాష్
ప్రయాణంలో బ్యాగ్ పోగొట్టుకున్నా: ఎస్‌ఐ భానుప్రకాష్
అప్పటినుంచి గన్ మిస్ విషయాన్ని దాచిపెట్టిన ఎస్‌ఐ
బెట్టింగులు ఆడి లక్షలు డబ్బులు పోగొట్టుకున్న ఎస్ఐ భానుప్రకాష్
కడప జిల్లా రాయచోటిలో పొలాలు విక్రయించిన ఎస్‌ఐ భానుప్రకాష్
రూ.96 లక్షల డబ్బులను ట్రాన్సాక్షన్ చేసిన ఎస్‌ఐ భానుప్రకాష్
మరొక ఉద్యోగం రావడంతో ఏపీకి వెళ్లేందుకు NOC అడిగిన ఎస్సై
సర్వీస్ రివాల్వర్ వాపస్ చేయాలని సూచించిన పోలీసులు
బయటపడిన ఎస్‌ఐ భానుప్రకాష్ అసలు బండారం
కొనసాగుతున్న అంబర్‌పేట పోలీసుల ఇన్వెస్టిగేషన్
-
Nov 28, 2025 08:31 IST
మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం
3 నూతన జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చ
మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలతో పాటు..
5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఇప్పటికే సిఫారసు
కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను ఆమోదించనున్న మంత్రి మండలి
ఇప్పటికే వీటి ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలియజేయాలంటూ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి
రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడులు, ఏర్పాటుకు మంత్రిమండలిలో ఆమోదముద్ర
పలు భూ కేటాయింపులు పై కూడా క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం
-
Nov 28, 2025 07:10 IST
బ్యాంకులకు శంకుస్థాపన..
నేడు అమరావతిలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
అమరావతిలో 15 బ్యాంకులు, బీమా ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన
నిర్మలాసీతారామన్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం
-
Nov 28, 2025 07:10 IST
నేడు కోకాపేటలో భూములకు ఈ వేలం
నియోపొలిస్, గోల్డెన్ మైల్‌లో 15,16 ప్లాట్లకు వేలం
ఇటీవల వేలంలో రూ.137 కోట్లు పలికిన ఎకరం ధర
-
Nov 28, 2025 07:08 IST
నేటినుంచి రాయ్‌పూర్‌లో డీజీపీ-ఐజీపీల సమావేశం
హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్ షా, దోవల్
పలు అంశాలపై 3 రోజులు డీజీపీ-ఐజీపీల భేటీలో చర్చ
-
Nov 28, 2025 07:08 IST
నేడు కర్ణాటక, గోవాలో ప్రధాని మోదీ పర్యటన
ఉడిపి శ్రీకృష్ణ మఠానికి ప్రధాని మోదీ
లక్ష కంఠ గీతా పారాయణలో పాల్గొననున్న ప్రధాని
సువర్ణ తీర్థ మండపాన్ని ప్రారంభించనున్న మోదీ
గోవాలో శ్రీ సంస్థాన్ గోకర్ణ మఠం కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ
77 అడుగులు శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని
-
Nov 28, 2025 07:08 IST
తమిళనాడులో భారీ వర్షాలు
నాగపట్నం, పుదుక్కోటై, తంజావూర్,..
తిరువారూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్
మరో 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్