kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా..? అయితే ఇవి తినండి..
ABN, Publish Date - Nov 02 , 2025 | 09:23 AM
ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్లు రావడమనేది సాధారణ విషయమైపోయింది. ఒకప్పుడు పెద్దవాళ్లకు మాత్రమే కిడ్నీలో స్టోన్స్ రావడం చూస్తుండేవాళ్లం. కానీ ఇప్పుడు టీన్ ఏజ్ వారికి కూడా ఈ సమస్య వస్తుంది. మరి కిడ్నీ స్టోన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏ ఆహారాలు తింటే కిడ్నీ స్టోన్స్ రాకుండా నివారించగలమో ఇప్పుడు తెలుసుకుందాం.
1/6
కిడ్నీలో రాళ్లు వస్తే భరించలేని నొప్పి పుడుతుంది. మోడర్న్ మెడిసిన్‌లో దీనికి అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్స్ ఉన్నా, మనకు లభించే కొన్ని మామూలు ఆహారాలతో కూడా ఈ సమస్యను కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లను కరిగించి, వాటిని ఈజీగా బయటకు పంపేందుకు కొన్ని ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి పవర్‌ఫుల్ ఫుడ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
2/6
బార్లీ వాటర్ : ట్రెడిషనల్ మెడిసిన్‌లో బార్లీ వాటర్‌కు స్పెషల్ ప్లేస్ ఉంది. ఇది కిడ్నీలను క్లీన్ చేస్తుందని నమ్ముతారు. ఈ డ్రింక్ యూరిన్ ఫ్లోను పెంచి, కిడ్నీ వ్యవస్థ శుభ్రంగా ఫ్లష్ అయ్యేలా చేస్తుంది. ఇది అప్పటికే ఉన్న రాళ్లను సాఫ్ట్‌గా మార్చి, అవి తక్కువ నొప్పితో బయటకు వెళ్లేలా చేస్తుందని అంటారు ఇది ఓవరాల్‌గా యూరినరీ ట్రాక్ట్ హెల్త్‌కు ఒక మంచి టానిక్‌లా పనిచేస్తుంది.
3/6
కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లు కేవలం దాహం తీర్చడమే.. మాత్రమే కాదు.. ట్రెడిషనల్‌గా, దీన్ని యూరినరీ ట్రాక్ట్‌ను క్లీన్ చేసే ఒక నేచురల్ క్లెన్సర్‌గా భావిస్తారు. దీనిలో ఉండే ఎలక్ట్రోలైట్స్... మినరల్స్ క్రిస్టల్స్‌గా మారి కిడ్నీ స్టోన్స్‌గా మారకుండా ఆపుతాయని నమ్ముతారు.
4/6
దానిమ్మ : దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, కొన్ని ప్రత్యేకమైన యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సంప్రదాయ వైద్యంలో, ఇవి కిడ్నీ ఫంక్షన్‌ను సపోర్ట్ చేసి యూరినరీ హెల్త్‌ను మెరుగుపరుస్తాయని భావిస్తారు. ఈ పండులోని నేచురల్ ప్రాపర్టీస్... స్టోన్-ఫార్మింగ్ మినరల్స్ పేరుకుపోకుండా కంట్రోల్ చేస్తాయని నమ్ముతారు.
5/6
నిమ్మరసం : తాజా నిమ్మరసంలో నేచురల్ సిట్రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సిట్రేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా అరికడుతుంది. ఇది చిన్న చిన్న క్రిస్టల్స్ ఏర్పడటాన్ని, పెరగటాన్ని ఆపేస్తుంది. రోజూ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే చిన్న రాళ్లు కరిగిపోతాయని, ఫ్యూచర్‌లో రాళ్లు రాకుండా ఉంటాయని నమ్ముతారు.
6/6
కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ : ఆహారం ద్వారా తగినంత కాల్షియం తీసుకోవడం చాలా అవసరం. NIDDK ఎక్స్‌పర్ట్స్ ప్రకారం, రోజూ 1,000-1,200 మిల్లీగ్రాముల కాల్షియంను టోఫు, బాదం, ఆకుకూరల వంటి వాటి నుంచి తీసుకోవాలి. ఈ డైటరీ కాల్షియం మన డైజెస్టివ్ సిస్టమ్‌లో ఇతర ఫుడ్స్ నుంచి వచ్చే ఆక్సలేట్‌తో కలిసిపోతుంది. ఈ ప్రాసెస్ వల్ల ఆక్సలేట్ మన బాడీలో అబ్సార్బ్ కాకుండా, కిడ్నీల్లో రాళ్లుగా మారకుండా ఆగిపోతుంది.
Updated at - Nov 02 , 2025 | 09:23 AM