Himba : ఈ తెగ మహిళలు తమ జీవితకాలంలో ఒక్కసారే స్నానం చేస్తారు..
ABN, Publish Date - Mar 11 , 2025 | 09:07 PM
Himba : ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల తెగలు ఉన్నాయి. అడవుల్లో జీవించే వారిది ఒక్కోక్కరిదీ ఒక్కో శైలి. అలాగే ఆఫ్రికాకు చెందిన ఈ తెగ మరీ భిన్నం. ఈ జాతికి చెందిన మహిళలు జీవితంలో ఒకే ఒక్కసారి స్నానం చేస్తారంట..

ఆరోగ్యంగా ఉండటానికి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ఆఫ్రికాలోని ఒక తెగకు చెందిన మహిళలు జీవితంలో ఒక్కసారే స్నానం చేస్తారు. దక్షిణాఫ్రికాలో ఉన్న నమీబియాలో నివసిస్తున్న హింబా తెగకు చెందిన మహిళలు తమ జీవితకాలంలో ఒక్కసారే స్నానం చేస్తారు.

హింబా తెగ మహిళలు జీవితకాలంలో ఒక్కసారే స్నానం చేసినప్పటికీ వారు తమను తాము శుభ్రంగా ఉంచుకునేందుకు వివిధ రకాల పద్ధతులు పాటిస్తారు.

హింబా తెగకు చెందిన మహిళలు పెళ్లి రోజున మాత్రమే నీటితో స్నానం చేయడానికి అనుమతి ఉంటుందంట. ఈ స్త్రీలు పెళ్లి రోజు తప్ప మరెప్పుడూ నీటితో స్నానం చేయకూడదు.

కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా హింబా తెగలో మహిళలు నీటితో స్నానం చేయకూడదనే నియమం విధించబడిందని చెబుతారు. ఎందుకంటే నమీబియాలో నీటి కొరత చాలా ఉంది.

హింబా తెగ మహిళలు స్నానానికి నీటిని ఉపయోగించే బదులు ప్రత్యేక మూలికలను ఉపయోగిస్తారు. మూలికలను కాల్చి వాటి నుండి వెలువడే పొగలో స్నానం చేస్తే చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియా అంతా చనిపోయి శుభ్రంగా ఉంటామ హింబా తెగ నమ్మకం.

మూలికలతో పాటు హింబా మహిళలు జంతువుల కొవ్వుతో తయారు చేసిన లోషన్, కీటకాలు , మండే ఎండ నుండి రక్షించే హెమటైట్ అనే ఖనిజాన్ని కూడా ఉపయోగిస్తారు.
Updated at - Mar 11 , 2025 | 09:07 PM