Valentine's Day : ప్రపంచంలోని 7 టాప్ రొమాంటిక్ నగరాలు.. ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసా..

ABN, Publish Date - Feb 11 , 2025 | 03:03 PM

Valentine's Day : త్వరలోనే వాలెంటైన్స్ డే రాబోతోంది. ఈ రోజున తమ ప్రేమను వ్యక్తపరచాలని, లవర్‌ని సర్‌ప్రైజ్ చేయాలని అనుకోవడం సహజం. జీవితంలో ఫిబ్రవరి 14ను మరపురాని రోజుగా మార్చుకునేందుకు కొందరు స్పెషల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. ఈ 7 నగరాల్లో ఒకదాన్ని ఎంచుకుని మీ వాలెంటైన్స్ డేని మరింత ప్రత్యేకంగా మార్చుకోండి..

Valentine's Day : ప్రపంచంలోని 7 టాప్ రొమాంటిక్ నగరాలు.. ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసా.. 1/9

ప్రేమికుల దినోత్సవం వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ వాలెంటైన్స్ డేని మరపురానిదిగా మార్చుకోవాలని తహతహలాడుతుంటారు. ఎక్కడికైనా వెళ్లి ఏకాంతంగా భాగస్వామితో గడిపేందుకు ప్రత్యేక టూర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

Valentine's Day : ప్రపంచంలోని 7 టాప్ రొమాంటిక్ నగరాలు.. ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసా.. 2/9

మీరు వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి ఒక రొమాంటిక్ ప్రదేశం కోసం చూస్తుంటారు. వాలెంటైన్స్ డేని జీవితంలో అత్యుత్తమంగా మార్చుకోవాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాలకు వెళ్లితీరాల్సిందే.

Valentine's Day : ప్రపంచంలోని 7 టాప్ రొమాంటిక్ నగరాలు.. ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసా.. 3/9

1800లలో హనీమూన్ సంప్రదాయం ప్రారంభమైనప్పటి నుండి, నయాగరా జలపాతాన్ని ప్రపంచ హనీమూన్ రాజధానిగా పిలుస్తున్నారు. ఇది కెనడాలోని ఒంటారియో, యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది.

Valentine's Day : ప్రపంచంలోని 7 టాప్ రొమాంటిక్ నగరాలు.. ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసా.. 4/9

"ప్రేమ నగరం"గా పిలువబడే పారిస్, సీన్ నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ కొవ్వొత్తుల వెలుగులో విందు చేసుకోవాలని ప్రేమికులు కలలు కంటుంటారు. ప్రకాశవంతమైన ఐఫిల్ టవర్‌ను చూస్తూ అందమైన టుయిలరీస్ తోటల గుండా షికారు చేయాలని కోరుకుంటారు. భాగస్వామితో గడిపేందుకు ఇదో అద్భుత ప్రదేశం. వెలుగులో విందును ఆస్వాదించడం నుండి ప్రకాశవంతమైన ఐఫిల్ టవర్‌ను చూస్తూ అందమైన టుయిలరీస్ తోటల గుండా షికారు చేయడం వరకు శృంగారానికి సరైన ప్రదేశం. కాబట్టి, మీరు ఈ రోజు మీ ప్రియమైన వారితో బాగా గడపవచ్చు.

Valentine's Day : ప్రపంచంలోని 7 టాప్ రొమాంటిక్ నగరాలు.. ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసా.. 5/9

ప్రేమికులకు మాల్దీవులు సరైన గమ్యస్థానం. ఇక్కడ సూర్యాస్తమయ క్రూయిజ్‌లు, ప్రైవేట్ ఐలాండ్ రిసార్ట్‌లు, వాటర్ విల్లాలు మరపురాని అనుభవాన్ని అందిస్తాయి.

Valentine's Day : ప్రపంచంలోని 7 టాప్ రొమాంటిక్ నగరాలు.. ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసా.. 6/9

వెనిస్, ఇటలీ: ఇటలీలోని వెనిస్ నగరం కాలువలకు మధ్య నిర్మించారు. చుట్టూ నీటితో చూడముచ్చటగా ఉంటుంది. ప్రేమికులు కలల గమ్యస్థానం ఈ అందమైన నగరం. అందమైన కాలువలపై బోటుపై ప్రయాణిస్తే వచ్చే ఆ థ్రిల్లే వేరు. ఆకర్షణీయమైన కట్టడాల మధ్య ఇక్కడ వాలెంటైన్స్ డే జరుపుకుంటే ఆ కిక్కే వేరు.

Valentine's Day : ప్రపంచంలోని 7 టాప్ రొమాంటిక్ నగరాలు.. ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసా.. 7/9

ప్రేగ్, చెక్ రిపబ్లిక్: చెక్ రిపబ్లిక్ లోని ప్రేగ్ నగరం కూడా చాలా అందంగా ఉంటుంది. రాత్రి వెలుతురులో నగరం చాలా అందంగా కనిపిస్తుంది. భాగస్వామితో గడిపేందుకు చక్కటి ప్రదేశం. చార్లెస్ బ్రిడ్జి, కేబుల్ కార్ రైడ్స్, పెట్రిన్ గార్డెన్స్, జలపాతాలు... ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి.

Valentine's Day : ప్రపంచంలోని 7 టాప్ రొమాంటిక్ నగరాలు.. ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసా.. 8/9

శాంటోరిని, గ్రీస్: గ్రీస్‌లోని శాంటోరిని పట్టణంలో సాంప్రదాయ తెల్లని రంగు భవనాలు, అందమైన బీచ్‌లు, అద్భుతమైన సూర్యాస్తమయాలు‌ రొమాంటిక్‍ ఫీలింగ్ కలిగిస్తాయి. కొండ ప్రాంతాల మధ్య ఉన్న గ్రామాల గుండా నడకను ఆస్వాదించవచ్చు. ఏజియన్ సముద్ర దృశ్యాన్ని గ్రీక్ రెసిపీస్ రుచి చూడవచ్చు. పార్ట్‌నర్‌తో కలిసి ఏం చక్కా పడవ యాత్ర కూడా చేయవచ్చు.

Valentine's Day : ప్రపంచంలోని 7 టాప్ రొమాంటిక్ నగరాలు.. ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసా.. 9/9

మౌయి, హవాయి, USA: మౌయి హవాయిలో రెండవ అతిపెద్ద ద్వీపం. దీని విస్తీర్ణం 1,883 కి.మీ. ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉంటుంది. సూర్యోదయాలు, హెలికాప్టర్ పర్యటనలు మంచి రొమాంటిక్ ఫీలింగ్ కలిగిస్తాయి.

Updated at - Feb 11 , 2025 | 03:05 PM