Chanakya Niti : చాణుక్యుడి ప్రకారం.. ఈ 6 రకాల వ్యక్తులను మీ ఇంటికి ఆహ్వానిస్తే నాశనమవుతారు..
ABN, Publish Date - Feb 14 , 2025 | 01:39 PM
Chanakya Niti : చాణక్యుడు అర్థశాస్త్ర పితామహుడే కాదు. గొప్ప రాజకీయవేత్త, సంఘసంస్కర్త, మనస్తత్వ శాస్త్రవేత్త, మేనేజ్‌మెంట్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో మేటి. ఆయన చెప్పిన సూచనల విలువలు తరాల గడిచినా మారిపోవు. మాసిపోవు. మరి, ఆర్థికంగా, సామాజికంగా నలుగురిలో గొప్పగా బతకాలంటే ఈ ఆరుగురు వ్యక్తులను ఆహ్వానించకూడదనేది చాణక్యుడి సలహా.

చాణక్య నీతి ఆర్థిక, రాజకీయ, మానవ సంబంధాలు సహా జీవితంలోని వివిధ అంశాలపై మార్గనిర్దేశం చేసే పురాతన భారతీయ గ్రంథం. ఇందులో చాణక్యుడు ఈ 6 రకాల వ్యక్తులను మీ ఇంటికి ఆహ్వానించకూడదని సలహా ఇస్తున్నారు.

అబద్ధాలకోరును మీ ఇంటికి ఆహ్వానించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని.. మీ ప్రతిష్ట దెబ్బతింటుందని చాణక్య నీతి హెచ్చరిస్తుంది.

చిన్న విషయానికి కోపం తెచ్చుకునే వ్యక్తి మీ ఇంట్లో ఉద్రిక్త వాతావారణం, సంఘర్షణలు సృష్టించవచ్చు. ఇది ఇతరులకు అసహ్యకరమైన భావనతో పాటు నెగటివిటీని పెంచుతుంది.

నిత్యం అసూయతో రగిలిపోయే వ్యక్తి క్రమంగా పగ దారితీసి సంబంధాలకు హాని కలుగుతుంది. అలాంటి వారిని మీ ఇంటికి ఆహ్వానించకుండా ఉండటమే మంచిది.

పుకార్లను వ్యాప్తి చేసేవారు మీపై కలబొల్లి కబుర్లు ప్రచారం చేసి ఇతరుల్లో మీపై ఏహ్యభావాన్ని పెంచేలా చేస్తారు. తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదముంది. ఇలాంటి వారికి దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.

సోమరితనం లేదా పనిలేకుండా ఉండే వ్యక్తులను ఇంటికి ఆహ్వానించకూడదని చాణక్య నీతి సలహా ఇస్తుంది, ఎందుకంటే వారి బద్ధకం ప్రభావం మీపై పడి నష్టం జరిగే అవకాశముంది.

నిజాయితీ లేని లేదా అవినీతిపరుడైన వ్యక్తిని దూరంగా ఉంచండి. నైతికత లేని వ్యక్తిని మీ ఇంటికి ఆహ్వానించడం వల్ల మీలో విలువలపై నమ్మకం సన్నగిల్లి రాజీపడే ప్రమాదముంది.

మిమ్మల్ని ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ , సానుకూల, విశ్వసనీయమైన వ్యక్తులనే దగ్గరకు రానీయండి. ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగిస్తూ వ్యక్తిగత నైతికతను పెంచుకోండని చాణక్యుడు నొక్కి చెబుతున్నారు.
Updated at - Feb 14 , 2025 | 01:42 PM