Shocking Facts : ఈ 7 జంతువులు ఆకలేస్తే సొంత పిల్లలనే స్వాహా చేస్తాయి..
ABN, Publish Date - Mar 18 , 2025 | 06:02 PM
Shocking Facts : సృష్టిలో అనంతమైనది అమ్మ ప్రేమ ఒక్కటే అంటారు. కానీ, ఈ విషయం తెలిస్తే మీరు షాక్ అవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే, ఈ 7 జంతువులు ఆకలేస్తే సొంత పిల్లలనే తినేస్తాయి మరి.. అవేంటంటే..

Shocking Facts : ప్రపంచంలో తల్లి అయిన ప్రతి జీవి బిడ్డలతో ప్రేమగా ఉంటుందని అందరూ భావించడం సహజం. కానీ, ఈ భూమిపై ఉన్న ఈ 7 జంతువులు అందుకు మినహాయింపు. ఇవి ఆకలేస్తే సొంత బిడ్డలనే కనికరం లేకుండా స్వాహా చేస్తాయి. వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.

ఎలుకల జాతి అతి చిన్నవైన చిట్టెలుకలు చూసేందుకు ఎంత ముద్దుగా ఉంటాయో కదా. కానీ, ఆహారం లభించని పరిస్థితుల్లో ఇవి బిడ్డలనే ఆరగించి కడుపు నింపుకుంటాయంట.

తెల్లగా, ఠీవిగా, చూసేందుకు ముచ్చటగా ఉంటాయి ధృవపు ఎలుగుబంట్లు. వీటి పిల్లలైతే ఇంకా ముద్దొస్తాయి. ఇవి కూడా వాటికి ఆహారం దొరకకపోతేసొంత పిల్లలను తింటాయి.

టైగర్ షార్క్ కు రెండు గర్భాశయాలు ఉంటాయి. దీని శరీరంలో చాలా గుడ్లు ఉంటాయి. ఇవి ఆకలేసినప్పుడు ఒకదానికొకటి చంపుకుని తినడం ప్రారంభిస్తాయి. అవసరమైతే అది సొంత గుడ్లను తినేందుకు వెనుకాడవు.

బ్లాక్ విడో సాలీడుల్లో ఆడ సాలీడ్లు ఆకలేస్తే తన భాగస్వామిని అలాగే తన గుడ్లు, పిల్లలను తింటుంది.

ఆడ ఎలుకలు ఇతర జీవుల వల్ల హాని జరుగుతుందని భయపడి బయటికి అడుపెట్టనపుడు లేదా వాటి మనుగడ అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు తమ పిల్లలను తింటాయి.

అక్వేరియంలో ఉంచిన గప్పీ చేపలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆడ గుప్పీలు తమ సొంత పిల్లలను తినడటం చాలా మంది ప్రత్యక్షంగా చూశారు.

ఆడ ప్రేయర్ మాంటిస్ లేదా గ్రాస్ హోపర్ సంభోగం తర్వాత తమ భాగస్వామినే తినేస్తాయి. అవసరమైతే పిల్లలను ఆరగిస్తాయి.

తట్టుకోలేని బాధలో ఉన్నప్పుడు ఆడ కుందేలు సొంత బిడ్డనే తింటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Updated at - Mar 18 , 2025 | 06:05 PM