Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు

ABN, Publish Date - Jul 20 , 2025 | 08:03 AM

కాజీపేటలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్‌, కిషన్‌రెడ్డి శనివారం పర్యటించారు. ప్రత్యేక రైలులో కాజీపేట రైల్వేస్టేషన్‌కు అశ్వినీవైష్ణవ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు చేరుకున్నారు. రైల్వే తయారీ యూనిట్‌ను పరిశీలించారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించి రైల్వే అధికారులకి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 1/14

కాజీపేటలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్‌, కిషన్‌రెడ్డి శనివారం పర్యటించారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 2/14

ప్రత్యేక రైలులో కాజీపేట రైల్వేస్టేషన్‌కు అశ్వినీవైష్ణవ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు చేరుకున్నారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 3/14

రైల్వే తయారీ యూనిట్‌ను కేంద్రమంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులకి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 4/14

ఈ సందర్భంగా జోధ్‌పూర్‌కు కొత్త రైలును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ జెండా ఊపి ప్రారంభించారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 5/14

ప్రవాసీ రాజస్థాన్‌ వాసుల కోరిక అయిన ఈ రైలు కోసం మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, కిషన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని అశ్వనీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 6/14

జోధ్‌పూర్‌, కాచిగూడ స్టేషన్‌, సికింద్రాబాద్‌ స్టేషన్ల విస్తరణ, మూడో లైన్‌ ఏర్పాటుతో కాచిగూడా-భగత్‌కీ కోఠీ స్టేషన్‌ల మధ్య నేరుగా ప్రతీ రోజూ నడిచే రైలు వేసేందుకు వీలు కలిగిందని అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 7/14

రూ.521 కోట్లతో నిర్మిస్తున్న కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌‌‌లో 2026 మార్చి నాటికి ఉత్పత్తి మొదలవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 8/14

కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌‌‌లో శరవేగంగా పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 9/14

తెలంగాణ ప్రజల చిరకాల కలను నెరవేరుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాజీపేటలో బహుళ రైల్వే ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఉద్ఘాటించారు. కాజీపేట యూనిట్‌ను కేవలం రైల్వే కోచ్‌ల తయారీకి మాత్రమే పరిమితం చేయట్లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 10/14

వందే భారత్‌ రైళ్లను కూడా ఇక్కడే తయారు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 11/14

ఇక్కడ మెట్రో రైళ్ల బోగీలను కూడా తయారు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇంజన్లు, వ్యాగన్లు కూడా తయారు చేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పుకొచ్చారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 12/14

పీవీ నర్సింహారావు హయాం నుంచి వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ వరంగల్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్‌ ఉందని తెలిపారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 13/14

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాజీపేటలో బహుళ రైలు ఉత్పత్తి కేంద్రానికి భూమి పూజ చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా మూడు వేల మందికి, పరోక్షంగా మరిన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు.

Kazipet Railway Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన కేంద్రమంత్రులు 14/14

తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వరంగల్‌ విమానాశ్రయానికి భూమి కేటాయించమని కేసీఆర్ ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం భూసేకరణ జరిపి కేంద్రం చేతిలో పెడితే విమానాశ్రయం నిర్మాణం మొదలు పెడతామని కిషన్‌రెడ్డి ప్రకటించారు.

Updated at - Jul 20 , 2025 | 08:29 AM