Bandi Sanjay: హుజూరాబాద్‌లో విద్యార్థులకు సైకిళ్లని పంపిణీ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్
ABN, Publish Date - Jul 18 , 2025 | 07:20 AM
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుజూరాబాద్ కేంద్రంలో ‘మోదీ కానుక’గా అందిస్తున్న సైకిళ్లని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేంద్రమంత్రి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పూర్తితో, వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న నవ భారతంలో విద్యార్థుల భవిష్యత్‌కు దూరం అనేది విద్యకు అడ్డుకాకూడదని, పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గించాలనే సదుద్దేశంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 20వేల సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. అలాగే ఇతర తరగతి విద్యార్థులకు ‘మోదీ కిట్స్’ పేరుతో బ్యాగ్, వాటర్ బాటిల్, పుస్తకాలు అందివ్వాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. పేదరికం వల్ల చదువుకు దూరమయ్యే వేల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈ ప్రయత్నాలు భరోసానిస్తాయని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆశించారు.
1/10
హుజూరాబాద్ హైస్కూల్ మైదానంలో పదోతరగతి విద్యార్థులకు గురువారం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 1,037 సైకిళ్లను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంపిణీ చేశారు.
2/10
విద్యార్థులతో మాట్లాడుతున్న బండి సంజయ్
3/10
విద్యార్థినికి షేక్ హ్యాండ్ ఇస్తున్న బండి సంజయ్
4/10
బండి సంజయ్‌తో ఫొటో దిగుతున్న విద్యార్థులు, అధికారులు, ఉపాధ్యాయులు
5/10
విద్యార్థులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్న సైకిళ్లు
6/10
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు
7/10
పంపిణీ చేసిన సైకిళ్లతో ఫొటో దిగుతున్న విద్యార్థులు
8/10
విద్యార్థులు మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు.
9/10
విద్యార్థులు మంచిగా చదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని బండి సంజయ్ పేర్కొన్నారు.
10/10
కార్యక్రమంలో బండి సంజయ్‌తో ఫొటో దిగుతున్న ప్రముఖులు
Updated at - Jul 18 , 2025 | 07:28 AM