ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ABN, Publish Date - Sep 18 , 2025 | 03:28 PM

ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రాఫిక్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 1/6

ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రాఫిక్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2/6

ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ నిర్వహణ, అభివృద్ధిని తమ రాష్ట్రం త్రిపుర ముఖ్యమంత్రికి వివరిస్తానని ఆయన పేర్కొన్నారు.

ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 3/6

భారతదేశంలో గత పదేళ్లలో 60 శాతం మేర జాతీయ రహదారులు విస్తరించాయని వివరించారు. రహదారిపై క్రమశిక్షణ ఉన్న చోట ప్రాణానికి రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా త్రిపురలో ట్రాఫిక్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 4/6

హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్సీ) ఆధ్వర్యంలో ట్రాఫిక సమ్మిట్‌ 2025ను నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ రెండు రోజుపాటు జరుగుతుంది. ఇది సెప్టెంబర్ 19వ తేదీతో ముగియనుంది.

ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 5/6

ఈ సమ్మిట్‌‌లో వివిధ ప్రభుత్వ విభాగాలు స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, ప్రజలు పాల్గొన్నారు. ట్రాఫిక ఇబ్బందులు లేని సురక్షిత నగరాన్ని సాకారం చేయడానికి తీసుకోవల్సిన చర్యలను ఈ సదస్సు వేదికగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.

ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 6/6

ఈ సదస్సులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated at - Sep 18 , 2025 | 03:28 PM