నగర వాసులను ఆకట్టుకున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్'
ABN, Publish Date - Dec 08 , 2025 | 05:32 PM
ప్రపంచంలో రాష్ట్ర ఖ్యాతిని ఘనంగా చాటేలా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ, ఆర్థిక సదస్సు కోసం దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు తరలివస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే గ్లోబల్ సమిట్‌లో...44కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు, మేథోమథన సదస్సులు జరగనున్నాయి.
1/6
ప్రపంచంలో రాష్ట్ర ఖ్యాతిని ఘనంగా చాటేలా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ, ఆర్థిక సదస్సు కోసం దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు తరలివస్తున్నారు.
2/6
భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే గ్లోబల్ సమిట్‌లో...44కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు, మేథోమథన సదస్సులు జరగనున్నాయి.
3/6
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ రైజింగ్ సమిట్‌కు సంబంధించి ప్రచార హార్డింగ్స్ ఏర్పాటు చేశారు.
4/6
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలోని ఫ్లైఓవర్ పిల్లర్లపై దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ చిత్రాలు అందరిని ఆకట్టుకున్నాయి.
5/6
డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్ కు రానున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు.
6/6
'తెలంగాణ రైజింగ్' వేడుకల్లో భాగంగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి మెస్సీ స్వయంగా ఆసక్తి చూపారని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.
Updated at - Dec 08 , 2025 | 05:32 PM