Governor Jishnu Dev Varma: రాజ్‌భవన్‌లో గిరిజన యువతకు అవార్డులు అందజేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ABN, Publish Date - Nov 18 , 2025 | 12:39 PM
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గిరిజన యువతతో ఇంట్రాక్షన్ (వాలిడిక్టరీ)కార్యక్రమం సోమవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో 17వ ట్రైబల్ యూత్ ఎక్స్‌చేంజ్ పేరిట వారం రోజులపాటు హైదరాబాద్‌లో గిరిజన యువత సమ్మేళనం నిర్వహించారు.ఈ సమ్మేళనంలో చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన యువతీ, యువకులు పాల్గొన్నారు. చివరి రోజు సోమవారం గిరిజన యువత గవర్నర్ కార్యాలయాన్ని సందర్శించారు. వారం రోజులపాటు తాము తెలుసుకున్న అంశాలను, నూతన ఆవిష్కరణలకు సంబంధించి వారి మధ్య జరిగిన చర్చలను గవర్నర్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారికి నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను గవర్నర్, మధుయాష్కీ కలిసి అందజేశారు.
1/26
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గిరిజన యువతతో ఇంట్రాక్షన్(వాలిడిక్టరీ)కార్యక్రమం సోమవారం నాడు జరిగింది.
2/26
ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు.
3/26
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో 17వ ట్రైబల్ యూత్ ఎక్స్‌చేంజ్ పేరిట వారం రోజులపాటు హైదరాబాద్‌లో గిరిజన యువత సమ్మేళనం నిర్వహించారు.
4/26
ఈ సమ్మేళనంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన యువతీ, యువకులు పాల్గొన్నారు.
5/26
గవర్నర్ కార్యాలయాన్ని గిరిజన యువత సోమవారం సందర్శించారు.
6/26
విద్యార్థులతో మాట్లాడుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
7/26
వారం రోజులపాటు గిరిజన యువత తెలుసుకున్న అంశాలను, నూతన ఆవిష్కరణలకు సంబంధించి వారి మధ్య జరిగిన చర్చలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పంచుకున్నారు.
8/26
ఈ సందర్భంగా వారికి నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మధుయాష్కీ గౌడ్ కలిసి అందజేశారు.
9/26
ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇస్తున్న గిరిజన యువత.
10/26
సభికులకు నమస్కరిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మధుయాష్కీ గౌడ్, తదితరులు.
11/26
గిరిజన సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్.
12/26
డోలు వాయిస్తున్న గిరిజన కళాకారులు.
13/26
కార్యక్రమంలో మాట్లాడుతున్న విద్యార్థులు.
14/26
కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు, గిరిజన విద్యార్థులు.
15/26
కార్యక్రమంలో మాట్లాడుతున్న వక్తలు.
16/26
కార్యక్రమంలో మాట్లాడుతున్న మధుయాష్కీ గౌడ్.
17/26
కార్యక్రమంలో మాట్లాడుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
18/26
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని సన్మానిస్తున్న ప్రముఖులు.
19/26
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, తాగునీరు లాంటి కనీస సదుపాయాలు ఇంకా లేకపోవడం బాధాకరమని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు.
20/26
సామాజిక, ఆర్థిక అణిచివేత కారణంగా చాలామంది గిరిజన యువత నక్సలిజం వైపు వెళ్తున్నారని తెలిపారు మధుయాష్కీ గౌడ్.
21/26
కార్యక్రమంలో గవర్నర్, మధుయాష్కీగౌడ్, తదితరులు.
22/26
గవర్నర్‌కి పూల బొకే అందజేస్తున్న మధుయాష్కీ గౌడ్, తదితరులు.
23/26
కార్యక్రమంలో గిరిజన యువతకు అవార్డులు అందజేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మధుయాష్కీ గౌడ్, తదితరులు.
24/26
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు.
25/26
గిరిజన యువతకు అవార్డు అందజేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
26/26
వేదికపై గిరిజన విద్యార్థులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలని వీక్షిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మధుయాష్కీగౌడ్.
Updated at - Nov 18 , 2025 | 12:53 PM