Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు..

ABN, Publish Date - Oct 26 , 2025 | 04:32 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక ఆదివాసి చెంచుల వివాహాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్టు దేవ్ వర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు వనవాసీ కళ్యాణ పరిషత్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 1/12

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో 111 జంటలు ఒక్కటయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఆదివాసి చెంచుల వివాహాలు జరిగాయి.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 2/12

ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు వనవాసీ కళ్యాణ పరిషత్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 3/12

2021లో 140 జంటలకు ఇలాగే వివాహం జరిపించారు. ఈ సారి అంటే.. నేడు 111 జంటలకు వివాహం జరిపించారు.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 4/12

ఈ వివాహం అనంతరం గవర్నర్ ఆశీస్సులను ఈ జంటలు అందుకున్నారు. అంతకు ముందు అచ్చంపేట చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 5/12

కొవిడ్ సమయంలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో.. దాతల సహకారంతో చెంచులకు నిత్యవసర వస్తువులను అందించారు. ఆ సమయంలో చాలా మంది వివాహాలు చేసుకోకుండా.. సహజీవనం చేస్తున్నట్లు గుర్తించారు.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 6/12

ఈ విషయాన్ని వనవాసీ కల్యాణ పరిషత్తు పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లారు. దాంతో వారు స్పందించి.. దాతల సహకారంతో 2021 అక్టోబర్ 30న అచ్చంపేటలో 140 జంటలకు వివాహాలు జరిపించారు.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 7/12

దీనికి ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివాహానికి అవసరమైన వస్తువులను ఈ పరిషత్ వారు అందజేశారు.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 8/12

ఈ సామూహిక వివాహాలకు సుమారు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని పరిషత్ నిర్వాహకులు తెలిపారు.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 9/12

నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన జంటలకు వివాహం జరిపించినట్లు వెల్లడించారు.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 10/12

నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన చెంచు యువకుడు ఒడిశాకు చెందిన ఒక చెంచు యువతిని ప్రేమించాడు. వారికి సైతం ఈ కార్యక్రమంలో వివాహం జరిగింది.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 11/12

ఈ సామూహిక వివాహా కార్యక్రమానికి దాదాపు రెండు వేల మంది హాజరయ్యారని నిర్వాహకులు చెప్పారు.

Mass Tribal Weddings in Achampet: గవర్నర్ సమక్షంలో ఘనంగా సామూహిక వివాహాలు.. 12/12

ఈ కార్యక్రమానికి గవర్నర్ వస్తున్న నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated at - Oct 27 , 2025 | 10:39 AM