తుది పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు.. నేటితో ముగిసిన పంచాయతి ఎన్నికల ప్రక్రియ
ABN, Publish Date - Dec 17 , 2025 | 05:31 PM
తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత పోలింగ్ ప్రక్రియ నేటితో అంటే.. బుధవారం (17-12-2025)తో ముగిసింది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. వృద్ధులు, వికలాంగులు సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి.. ఓటు వేశారు.
1/10
తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత పోలింగ్ ప్రక్రియ నేటితో అంటే.. బుధవారం (17-12-2025)తో ముగిసింది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
2/10
వృద్ధులు, వికలాంగులు సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి.. ఓటు వేశారు.
3/10
ఈ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువతి, యువకులు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాలను ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు.
4/10
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరిగాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో నిర్వహించారు.
5/10
ఇక ఈ మూడు దశల్లో జరిగిన ఎన్నికల పోలింగ్.. ఫలితాలు అదే రోజు వెలువడ్డాయి.
6/10
ఇప్పటికే తొలి, రెండో దశ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ఈ మూడో దశలో సైతం కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాలు గెలుచుకోనుందనే ఒక ప్రచారం సైతం సాగుతోంది.
7/10
బీఆర్ఎస్ సైతం చాలా స్థానాల్లో పార్టీ జెండాలను పాతింది. బుధవారం.. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. గెలుపొందిన సర్పంచ్‌లను సన్మానించిన విషయం విదితమే. ఇక జిల్లా కేంద్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు.. విజయం సాధించిన అభ్యర్థులను సన్మానించారు.
8/10
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు.. ఆ పార్టీ పూర్వ వైభవానికి చిహ్నమని ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే.
9/10
తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వృద్ధురాలు
10/10
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ హనుంతరావు, ఇతర ఉన్నతాధికారులు
Updated at - Dec 17 , 2025 | 05:31 PM