Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న చైతూ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్..

ABN, Publish Date - Feb 22 , 2025 | 07:03 PM

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో నాగచైతన్య- శోభిత ధూళిపాల జంట ఒకటి. గతేడాది వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఈ యువ దంపతులు వారి గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలను కలిసి వారికి బహుమతులిచ్చి ధైర్యం చెప్పారు.

 Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న చైతూ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. 1/7

హైదరాబాద్‌లోని సెయింట్‌ జ్యూడ్‌ ఇండియా చైల్డ్‌ కేర్‌ సెంటర్‌‌లో చిన్నారుల మధ్య టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, ఆయన సతీమణి శోభిత ధూళిపాల ఆనందంగా గడిపారు.

 Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న చైతూ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. 2/7

క్యాన్సర్‌‌తో బాధపడే పిల్లల్లో నాగ చైతన్య, శోభిత ధూళిపాల మనోధైర్యాన్ని నింపారు.

 Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న చైతూ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. 3/7

క్యాన్సర్‌ చికిత్స కోసం వచ్చే పిల్లలకు, వారి కుటుంబాలకు సెయింట్‌ జ్యూడ్‌ ఇండియా చైల్డ్‌ కేర్‌ సెంటర్‌‌ ఉచిత ఆశ్రయం కల్పిస్తుంది.

 Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న చైతూ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. 4/7

సెయింట్‌ జ్యూడ్‌ ఇండియా చైల్డ్‌ కేర్‌ సెంటర్‌‌‌‌ను శనివారం నాడు నాగ చైతన్య, శోభిత ధూళిపాల సందర్శించి చిన్నారులతో ఆడిపాడారు.

 Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న చైతూ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. 5/7

చిన్నారులతో కలిసిపోయి.. వారితో కలిసి సరదాగా నాగ చైతన్య డ్యాన్స్ కూడా చేశారు. పిల్లలతో సెల్ఫీలు దిగి ముచ్చటించారు.

 Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న చైతూ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. 6/7

పిల్లలతో కబుర్లు చెబుతూ వారి కళ్లల్లో శోభిత ఆనందాన్ని నింపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి.

 Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న చైతూ.. ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్.. 7/7

అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య- శోభితలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా..ఇటీవలే చైతు నటించిన తండేల్ సినిమా బ్లాక్ బస్టర్‌‌గా దూసుకెళ్తుంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు దాటేసింది.

Updated at - Feb 22 , 2025 | 10:11 PM