Kalvakuntla Kavitha Vs Teenmar Mallanna:తీన్మార్ మల్లన్నపై కల్వకుంట్ల కవిత ఫిర్యాదు

ABN, Publish Date - Jul 13 , 2025 | 09:52 PM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనకు కవిత ఫిర్యాదు చేసింది.

Kalvakuntla Kavitha Vs Teenmar Mallanna:తీన్మార్ మల్లన్నపై కల్వకుంట్ల కవిత ఫిర్యాదు 1/5

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీకు 42 శాతం రిజర్వేషన్ అమలు బిల్లుకు రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై ప్రభుత్వం చీఫ్ వీప్ ఆది శ్రీనివాస్ సైతం స్పందించారు.

Kalvakuntla Kavitha Vs Teenmar Mallanna:తీన్మార్ మల్లన్నపై కల్వకుంట్ల కవిత ఫిర్యాదు 2/5

ఈ బిల్లుకు ఆమెకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. బిల్లు ఆమోదానికి సంబంధించిన క్రెడిట్ ఆమె తీసుకునేందుకు ప్రయత్నిస్తుందంటూ ఆయన ఆరోపించారు. ఆ మరునాడే.. జహీరాబాద్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం.. కవిత వ్యాఖ్యలపై ఆయన కాస్తా ఘాటుగా స్పందించారు.

Kalvakuntla Kavitha Vs Teenmar Mallanna:తీన్మార్ మల్లన్నపై కల్వకుంట్ల కవిత ఫిర్యాదు 3/5

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఆయన కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో కార్యాలయ సిబ్బందికి గాయాలయ్యాయి.

Kalvakuntla Kavitha Vs Teenmar Mallanna:తీన్మార్ మల్లన్నపై కల్వకుంట్ల కవిత ఫిర్యాదు 4/5

అయితే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను కవిత నిరసిస్తూ.. ఆయనపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖిందర్ రెడ్డికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మీ అసాధారణ అధికారాలను ఉపయోగించి.. మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లన్నపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

Kalvakuntla Kavitha Vs Teenmar Mallanna:తీన్మార్ మల్లన్నపై కల్వకుంట్ల కవిత ఫిర్యాదు 5/5

మరోవైపు కవిత, తీన్మార్ మల్లన్న సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. రాష్ట్రంలో కవితను తిరగనీయమంటూ మల్లన్న ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా.. తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌ల మీద ఉన్న ఫ్రస్టేషన్‌ తమపై చూపిస్తే.. ఎట్లా అంటూ కవితను పరోక్షంగా తీన్మార్ మల్లన్న విమర్శించారు.

Updated at - Jul 13 , 2025 | 09:55 PM