బతుకమ్మ ఆడిన సుందరీమణులు

ABN, Publish Date - May 14 , 2025 | 07:28 PM

విశ్వ నగరం హైదరాబాద్ వేదికగా మిస్‌ వరల్డ్‌ - 2025 పోటీలు జరుగుతోన్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు 109 దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ తరలి వచ్చారు. తెలంగాణలోని పలు చారిత్రక ప్రదేశాల్లో వారు పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. హన్మకొండలోని హరిత కాకతీయ రిసార్టు వద్ద మహిళలతో కలిసి సుందరీమణులు బతుకమ్మ ఆడి సందడి చేశారు.

Updated at - May 14 , 2025 | 07:28 PM