హైదరాబాద్‌లో ఉత్సాహంగా 5కే రన్
ABN, Publish Date - Mar 16 , 2025 | 11:54 AM
హైదరాబాద్ నగరంలో ఆదివారం 5కే రన్ ఉత్సాహంగా జరిగింది. అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోని నవోదయ కాలనీలో గల తులసివనం వద్ద నిర్వహించిన 5కే రన్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు.ఈ రన్‌లో పెద్ద ఎత్తున యువతీ, యువకులు పాల్గొన్నారు.

హైదరాబాద్ నగరంలో ఇవాళ(ఆదివారం) 5కే రన్ ఉత్సాహంగా జరిగింది.

అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోని నవోదయ కాలనీలో గల తులసివనం వద్ద నిర్వహించిన 5కే రన్‌ను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ రన్‌లో పెద్ద ఎత్తున యువతీ, యువకులు పాల్గొన్నారు.

మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగాను, సుసంపన్నంగాను ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

మహిళలు ఎల్లప్పుడూ తమ కుటుంబ సంక్షేమం గురించి ఆలోచిస్తూ వారి వ్యక్తిగత ఆరోగ్యంపై సరిగా శ్రద్ధ పెట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

ప్రతిరోజూ మహిళలు వారి ఆరోగ్యం కోసం కనీసం ఒక గంట కేటాయించాలని అలాగే శారీరక, మానసిక దృఢత్వం కోసం వ్యాయామం, యోగా, ధ్యానం, నడకను అలవాటు చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
Updated at - Mar 16 , 2025 | 11:59 AM