Manyamkonda Jatara: అంగరంగ వైభవంగా మన్నెంకొండ జాతర
ABN, Publish Date - Feb 13 , 2025 | 09:29 AM
మహబూబ్‌నగర్ పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో మన్యంకొండ ఉంది. తెలంగాణలోనే చిన్న తిరుపతిగా ఈ పుణ్యక్షేత్రం పేరుగాంచింది. మన్యంకొండ బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగుతున్నాయి.

తెలంగాణలోనే చిన్న తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఈ బ్రహ్మోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

మన్యంకొండ జాతరకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి , కలెక్టర్, ఎస్పీ, మూడా చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆలయ కమిటీ మెంబర్స్ హాజరయ్యారు.

ఫిబ్రవరి 12న రథోత్సవం జరిగింది. భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Updated at - Feb 13 , 2025 | 09:34 AM