సైబర్ నేరాల కోసం భారీగా సెల్ ఫోన్ల సేకరణ.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

ABN, Publish Date - Mar 11 , 2025 | 07:50 PM

సైబర్ నేరాలకు పాల్పడేందుకు భారీ కుట్రకు తెర తీసిన ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించిన ఐదుగురు అంతరాష్ట్ర సైబర నేరస్తులను అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో భారీ ఎత్తున సేకరించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 2125 పాత మొబైల్ ఫోన్లు,107 సిమ్ కార్డులు, ఐదు బీహార్‌కి చెందిన బైక్స్,600 మొబైల్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విలేకర్ల సమావేశంలో వివరించారు.

Updated at - Mar 11 , 2025 | 07:50 PM