నన్ను దూషించడమే ప్రభుత్వ విధానంగా మారింది: కేసీఆర్
ABN, Publish Date - Dec 21 , 2025 | 05:10 PM
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్రకార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
1/6
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్రకార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
2/6
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించాయని చెప్పారు. అంతేకాదు.. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనపై వ్యతిరేకత సైతం కనిపించిందని తెలిపారు.
3/6
తనను దూషించడమే ఈ ప్రభుత్వ విధానంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
4/6
కాంగ్రెస్ పార్టీ అధికార పీఠమెక్కి రెండేళ్లు అయినా.. నేటికి ఒక్క కొత్త పాలసీ సైతం తీసుకు రాలేదని విమర్శించారు. తెచ్చిన ఒక్క పాలసీ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిందేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ తగ్గిందన్నారు.
5/6
గతంలో యూరియా ఇంటికి, పంట చేనుకి వచ్చేదని గుర్తు చేశారు. కానీ నేడు యూరియా కోసం కుటుంబాలు క్యూ లైన్లలో కూర్చోవలసిన దుస్థితి నెలకుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
6/6
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Updated at - Dec 21 , 2025 | 05:10 PM