Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. కాళేశ్వర స్వామి వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Nov 05 , 2025 | 04:58 PM
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా మహాదేవుపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దేవస్థానం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమం వద్ద భక్తులు పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం నదిలో దీప దానం చేశారు. అలాగే నదీ ఒడ్డున ఉన్న స్వామి వారి విగ్రహం వద్ద 365 వత్తులతో దీపాలను వెలిగించారు.
1/9

2/9
ఆలయంలో స్వామి వారి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు
3/9
ఆలయంలో స్వామి వారి ముందు ఉన్న నందీశ్వరునికి పూజలు నిర్వహించిన భక్తులు
4/9
కార్తీక పౌర్ణమి వేళ.. దేవాలయం పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. ఉసిరి, వేప, రావి చెట్లుకు ప్రత్యేక పూజలు చేసి దీపారాధన చేశారు.
5/9
ఆలయం వద్ద మహాశివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
6/9
కాళేశ్వరం దేవస్థానం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నది సంగమం వద్ద భక్తులు పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం నదిలో దీప దానం చేశారు.
7/9
పుష్కర ఘాట్ల వద్దనున్న మహాశివుని విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
8/9
త్రివేణి సంగం వద్ద పవిత్ర స్నానమాచరించిన భక్తులు.. అనంతరం నదిలో దీప దానం చేశారు.
9/9
కార్తీక పౌర్ణమి వేళ.. నదీ లేదా సముద్ర స్నానం ఆచరించి.. అనంతరం ఆ పరమ శివునికి ప్రత్యేక పూజలు చేసి.. దీపా దానం చేయడం వల్ల ఉన్న దోషాలు తొలిగి.. శుభాలు జరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
Updated at - Nov 05 , 2025 | 05:00 PM